
జీడిమెట్ల, వెలుగు: ఢిల్లీ నుంచి వచ్చి, మహిళలే టార్గెట్ గా చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇంటర్ స్టేట్చైన్స్నాచింగ్ ముఠాను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పేట్బషీరాబాద్పోలీస్ స్టేషన్పరిధిలోని గుండ్లపోచంపల్లిలో హనుమాన్ గడ్డ మేరు హాస్పిటల్వద్ద ఈ నెల 10న ఓ మహిళ వాకింగ్ చేస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని పుస్తెల తాడును లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
అనుమానంతో కండ్లకోయలో దొంగతనానికి పాల్పడిన అజయ్శక్కర్వాల్, రాహుల్ సక్సేనా, రాజేశ్‌కుమార్, సాగర్ రామ్‌పాల్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఢిల్లీకి చెందినవారని, బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2 బైక్‌లను చోరీ చేశారని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.
వాటిపైనే తిరగుతూ దొంతతనాలు చేస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 3 తులాల పుస్తెలతాడు, 2 బైక్‌లు, 2 స్మార్ట్‌ఫోన్స్, 2 కీ ప్యాడ్ఫోన్లు, హ్యాండిల్ స్క్రూడ్రైవర్లు స్వాధీనం చేసుకొని, వారిని అరెస్ట్‌చేసినట్లు చెప్పారు. ఈ నలుగురిపై ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లలో 4 కేసులు , బోయిన్‌పల్లిలో 2 కేసులున్నట్లు పేర్కొన్నారు.