సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: సౌత్, ఈస్ట్ జోన్ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్, ఐఎస్ సదన్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5.50 లక్షల విలువైన 11 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ ఫిర్దౌస్, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన ఎండీ ఖాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ వెళ్లి 13 కిలోల గంజాయి కొనుగోలు చేశారు.

అనంతరం సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ హోటల్ సమీపంలో మాదన్నపేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సజ్జు, జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లికి చెందిన యూసుఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విక్రయించేందుకు యత్నించారు. సమాచారం మేరకు దాడులు నిర్వహించిన టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ బృందం ఖాదర్, ఫిర్దౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పట్టుకుని గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.