అంతర్రాష్ట్ర మద్యం ముఠా అరెస్ట్.. రూ.13.25 లక్షల అక్రమ మద్యం పట్టివేత

అంతర్రాష్ట్ర మద్యం ముఠా అరెస్ట్.. రూ.13.25 లక్షల అక్రమ మద్యం పట్టివేత

 కామారెడ్డి​ టౌన్​, వెలుగు :  ఇతర రాష్ట్రాల నుంచి   మద్యం తెచ్చి కామారెడ్డి జిల్లాలో  అమ్ముతున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్​ ఆఫీసర్లు తెలిపారు.  బుధవారం  జిల్లా కేంద్రంలో  ఉమ్మడి జిల్లాకు చెందిన  ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​  డిప్యూటీ కమిషనర్​  దశరథ్​ తెలిపిన ప్రకారం.. ఈనెల 2న  కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండలం కుప్రియాల్​లో   తనిఖీలు చేపట్టగా  గోవా, హర్యానా మద్యం పట్టుబడగా  ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.  

వీరిచ్చిన సమాచారంతో  మరి కొన్ని చోట్ల దాడులు చేసి మరో  9 మందిని   పట్టుకున్నట్టు తెలిపారు. మేడ్చల్​ జిల్లా  బౌరంపేట,  బాచుపల్లి ఏరియాల్లో తనిఖీలు చేపట్టి   మద్యం స్వాధీనం చేసుకున్నామని,   దీని విలువ రూ.13.25 లక్షల విలువ ఉంటుందన్నారు.  పట్టుబడిన వారిలో   కుప్రియాల్​కు చెందిన రాజ్​కుమార్​, వెంకట్​రెడ్డి,  నాగిరెడ్డిపేట మండలం పెద్ద ఆత్మకూర్​కు చెందిన   క్రిష్ణారెడ్డి, నారాయన్​రెడ్డి,   తాడ్వాయి మండలం ఎండ్రియాల్​ వాసి    చంద్రకాంత్​రెడ్డి,   హైదరాబాద్​ కు చెందిన   రమేశ్​,   ఆకాశ్​,  వై.వి.రెడ్డి, మదుసూధన్​రెడ్డి  ఉన్నట్టు వివరించారు.  సమావేశంలో  జిల్లా ఎక్సైజ్​ సూపరిండెంట్ రవీంధర్​ తదితరులు పాల్గొన్నారు.