పద్మారావునగర్, వెలుగు: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన అర్జున్ బోస్లే, భరత్ గంగుర్డే, సంతోష్ కుసలకర్, సాక్షి బాలూ దాహాడే రైళ్లలో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. వీరిని సోమవారం అరెస్టు చేసి 78 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో దొంగ మొహమ్మద్ సనిదుల్ ఇస్లాం(25)ను ఆదివారం అరెస్టు చేసి 29 గ్రాముల బంగారు గొలుసు, మొబైల్ ఫోన్ రికవరీ చేశారు.
