Akanksha Singh Interview: మీట్.. క్యూట్ కోడలు పిల్ల

Akanksha Singh Interview: మీట్.. క్యూట్ కోడలు పిల్ల

'మళ్లీ రావా'తో మొదటిసారి తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో సినిమా 'దేవ దాస్ 'లో నాగార్జునతో జతకట్టి, బ్యూటిఫుల్ పెయిర్ అనిపించింది. అప్పటికే హిందీలో టీవీ సీరియల్స్లో నటించి పేరు తెచ్చుకున్న ఆకాంక్ష సింగ్.. ఒకే రకం పాత్రల్లో నటించడం ఇష్టం లేక సౌత్ ఇండస్ట్రీ వైపు వచ్చింది. అప్పటి నుంచి తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో పెద్ద హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకుంది. లేటెస్ట్గా వచ్చిన 'మీట్ క్యూట్' వెబ్ సిరీస్ లో క్యూట్ గా కనిపిస్తోంది. మరి ఆమె జర్నీ ఎలా సాగిందో తన మాటల్లోనే...

“మాది రాజస్తాన్లోని జైపూర్, అమ్మ... థియేటర్ ఆర్టిస్ట్. నేను ఫిజియోథెరపీలో డిగ్రీ చేశా. డాన్స్ నేర్చుకున్నా. ...చిన్నప్పుడు డాన్సర్ అవుదామనుకున్నా. అలాంటి నాకు నాటకాల మీద ఇంట్రస్ట్ రావడానికి మా అమ్మే కారణం. పదిహేనేండ్ల వయసులో అమ్మతో కలిసి నాటకాల్లో ఎలా నటించాలో నేర్చుకోవడానికి వెళ్లా. నాటకాలు, మొదలుపెట్టాక, ఆ ఫీల్డే నచ్చింది. దాంతో అటు వైపు వెళ్లా... అంతే! ఫిజియోథెరపీ పూర్తయ్యే టైంకే కంప్లీట్ గా నాటకాల్లో ఉన్నా. దాంతో ప్రాక్టీస్కి కూడా టైం లేదు. వెంటనే సీరియల్లో అవకాశం వచ్చింది. నిజానికి చదువుకునే రోజుల్లో డాక్టర్ అవ్వాలని ఉండేది. యూనివర్సిటీలో కూడా నేను టాపర్. కానీ... ఇప్పుడు యాక్ట్రెస్ ఆకాంక్ష సింగ్గానే ఉండిపోవాలి అనుకుంటున్నా. నేను సినిమాల్లో నటించడానికి. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. నా ఫస్ట్ ప్రాజెక్ట్ సీరియల్ అయిపోగానే 2014లో పెండ్లి చేసుకున్నా. అతను నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తే.. పేరు కునాల్ సేన్. పెండ్లయ్యాక కునాల్ కూడా నేను యాక్టింగ్ చేయడానికి చాలా సపోర్ట్ చేశాడు. నిజానికి తను నా లైఫ్ లోకి వచ్చాకే ఇంకా యాక్టివ్నటిస్తున్నా.

టీవీతో కెరీర్ మొదలు...

నా బోలెతుమ్ నా మైన కుచ్ కహా లో 2012లో నటించా. అందులోభర్త చనిపోయి, ఇద్దరు పిల్లల తల్లిగా చేశా.. అందులోనా క్యారెక్టర్ పేరు మేఘా వ్యాస్ భట్నాగర్. ఆ క్యారెక్టర్ ఇప్పటికీ గుర్తుండిపోయింది ప్రజల్లో. ఆ రోల్ 'ఇండియన్ టెలీ అవార్డ్ ఫర్ న్యూఫేస్' కేటగిరీలో అవార్డ్ కూడా వచ్చింది. అది రెండు సీజన్స్ తర్వాత అయిపోయింది. ఆ తర్వాత 'గుల్మహర్ గ్రాండ్ ' (2015) అనే మినీ సిరీస్లో కనిపించా. అలాగే "బాక్స్ క్రికెట్ లీగ్' అనే రియాలిటీ స్పోర్ట్స్ షోలో పార్టిసిపేట్ చేశా. 2017లో 'ఆయే జిందగీ' అనే సీరియల్లో ఒక ఎపిసోడ్లో లాయర్ గా కనిపించా...

'పరంపర' సీజన్స్

మహిళలకు ఈ మధ్య మంచి కథలు వస్తున్నాయి. బలమైన క్యారెక్టర్స్ రాస్తున్నారు. నాకు అలా వచ్చిన కథ ఇది. టెలివిజన్ ని సినిమాల్లో చూడ్డానికి ఆడియెన్స్ కూడా ఇష్టపడుతున్నారు. టెలివిజన్, థియేటర్ ఏదైనా.. యాక్టర్ కి ఒకటే. నేను ఎప్పుడూ డబ్బు కోసం నటించలేదు.

అందుకే టీవీ మానేశా..

మేఘావ్యాస్గా నాకు చాలా పేరు తీసుకొచ్చింది టీవీ. చాలాకాలం అదే క్యారెక్టర్ కంటిన్యూ కావడం తో ఆడియెన్సీకి దగ్గరయ్యా. ఆ తర్వాత నుంచి అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి. ఆడియెన్స్ కూడా అలాంటివే చేయమనేవాళ్లు. కానీ, దాదాపు రెండేండ్లు ఆ క్యారెక్టర్ చేశా. వేరే సీరియల్స్ లో స్పెషల్ అప్పియరెన్స్ చేయాలన్నా ఆ క్యారెక్టరే. దాంతో అలాంటి రోల్స్ కంటిన్యూ చేయడం నాకు నచ్చలేదు. నేను యాక్టర్ ని, వేరే క్యారెక్టర్స్ కూడా చేయాలి అని గట్టిగా అనుకున్నా నా స్కిల్స్ ని ఎక్స్ఫోర్ చేయాలనుకున్నా.. అందుకనే కాస్త గ్యాప్ వచ్చినా పర్వాలేదు...డిఫరెంట్ రోల్స్ చేయాలని డిసైడ్ అయ్యా. అలాంటి అవకాశాల కోసం ఓపికగా ఎదురుచూశా. ఆ టైంలో వచ్చిన అవకాశాల్ని వదులుకున్నా, ప్రజలు నన్నుఒకే క్యారెక్టర్ లో గుర్తు పెట్టుకోవడం నాకిష్టం లేదు. క్రియేటివ్ శాటిస్ఫాక్షన్ చాలా ముఖ్యం ఈ లో. అందుకనే టీవీ సీరియల్స్ చేయడం మానేశా.

మొదటి సినిమా తెలుగులో..

డిఫరెంట్ రోల్స్ కోసం ఎదురుచూస్తున్నప్పుడే 'మళ్లీ రావా'లో అవకాశం వచ్చింది. కానీ... సినిమాల కోసం ఎదురుచూస్తున్న నేను తెలుగులో ఛాన్స్ అనగానే కాస్త ఆలోచించా. కొత్త ప్లేస్, కొత్త మనుషులు, భాష తెలియదు అని. కానీ, నా భర్త నన్ను కన్విన్స్ చేశాడు. 'నీ కెరీర్ గ్రాఫ్ పెరగాలంటే అన్నీ చేయాలి. అవకాశాన్ని ఎందుకు వదులుకుంటావ్? నువ్వు చేయగలవ్... చెయ్యి' అని చెప్పాడు. అలా ఆ సినిమాలో సుమంత్ పక్కన హీరోయిన్ గా చేశా. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్.. నాలోకాన్ఫిడెన్స్ పెంచింది. అదే ఏ హిందీలోనూ గెస్ట్ అప్పియరెన్స్ ఛాన్స్ వచ్చింది. వరుణ్ ధావన్, అలియాభట్ నటించిన 'బద్రినాథ్ కి దుల్హనియా'లో కిరణ్ కక్కర్ రోల్ లో కనిపించా. 2018లో 'మళ్లీ రావా'కి బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా సైమా అవార్డ్స్ కి నామినేట్ అయ్యా. ఆ ఏడాదే తెలుగులో మరో సినిమా 'దేవదాస్'లో అవకాశం వచ్చింది. నానికి జోడిగా రష్మిక. నాగార్జునకి జోడిగా నేను నటించాం. అదొక బెస్ట్ మెమరీ నాకు. సౌత్ ఆడియెన్స్కీ చాలా దగ్గరయ్యా....

కన్నడలో అవకాశం 2019లో వచ్చింది. 'పహిల్వాన్' సినిమాలో సుదీప్ కి జంటగా రుక్మిణి పాత్రలో నటించా. అది ఐదు భాషల్లో రిలీజ్ అయింది. ఆ తర్వాత 2021లో మళ్లీ తెలుగులోనే పరంపర' వెబ్ సిరీస్లో చేశా.. ఆ నెక్స్ట్ ఇయర్ తమిళంలో 'క్లాప్' అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చా.అది తెలుగులోనూ వచ్చింది. ఆ తర్వాత 'వీరపాండ్యపురం' అనే తమిళ సినిమాలో నటించా. అలా సౌత్లో మంచి అవకాశాలు రావడంతో నటిగా నా గ్రాఫ్ మారిపోయింది. ఏ రోల్ అయినా చేయగలిగే నటిగా ప్రూవ్ చేసుకునేందుకు బెస్ట్ ప్లాట్ ఫాం దొరికింది. ఇటు సౌత్లో చేస్తూనే హిందీలోనూ చేశా. అవేంటంటే... 2022లో హిందీలో 'ఎస్కేప్లైఫ్', 'రంగ్ బాజ్: డర్ కి రాజ్ నీతి'తో పాటు తెలుగులో 'మీట్ క్యూట్ 'లో 'ఇన్(లా) . లవ్' ఎపిసోడ్లో నటించా..

అమితాబ్ బచ్చన్ పెట్టిన పేరు

'రన్ వే 3 4' సినిమా కోసం యాక్షన్ సీన్ షూటింగ్ చేశాం. ఆ తరువాత నేను హోటల్ కి వెళ్లిపోయా. అక్కడ నడుస్తుంటే కాలు స్లిప్ అయ్యి, ఫ్రాక్చర్ అయింది. ఆ విషయం అమితాబ్ సర్కి తెలిసి, బగ్గీలోనన్ను చూడ్డానికి. వచ్చారు. నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కదా... ఈ బగ్గీలో వెళ్లు' అని ఆయన నాకోసం దాన్ని తీసుకొచ్చారు. నేను ఆశ్చర్యపోయా. ఒక ఫ్యాన్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలవి. ఆయనకు 'థాంక్స్' చెప్తూ ఒక కవిత రాశా. ఆయనకు అది చాలా బాగా నచ్చి, నాకు 'టూటీ ఫ్రూటీ' అని పేరు పెట్టారు. తన ఫోన్లో కూడా అలానే సేవ్ చేసుకున్నారు కూడా. క్లాప్' సినిమా రిలీజ్ అయ్యేముందు పోస్టర్, ట్రైలర్ చూశారు. హిందీ అమ్మాయి సొత్లో మంచి సినిమాలు చేస్తుందని మెచ్చుకుంటూ మెసేజ్ చేశారు.

'మళ్లీ రావా'లో..

మా ఫ్యామిలీతో దీపావళి చేసుకోవడానికి జైపూరికి వెళ్లా. కానీ, వాళ్ళందరికీ అప్పుడు కొవిడ్ పాజిటివ్ అని తెలిసింది. దాంతో నేను ఒక హోటల్ లో దిగా. అప్పుడు ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఫోన్ చేసి, ఆడిషన్ కి అడిగాడు. నేను వెళ్లా, సెలక్ట్ అయ్యా, అదే 'రనే 34'. అందులో అజయ్ దేవన్, అమితాబ్ బచ్చన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నా. అజయ్ దేవగన్ కూడా నన్ను రీల్స్ లో చూశానని చెప్పాడు. 'బద్రినాథ్ కే దుల్హనియా' తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ, నాకు అవి పెద్దగా నచ్చలేదు. ఇందులో కూడా అమితాబ్ బచ్చన్ ఉన్నారు. కేబీసీ చూసేటప్పుడు మా ఫ్యామిలీతో చెప్పేదాన్ని ఏదో ఒకరోజు ఆయనతో కలిసి నటించాలి నటిస్తాను అని.' అది నిజంగా జరిగేసరికి చాలా సంతోషంగా అనిపించింది.”

* అమ్మ సింగర్. అలా నాకు సింగింగ్ వచ్చింది. హార్స్ రైడింగ్ నేర్చుకున్నా.
* ఒక వైపు సినిమాలు, సిరీస్లు చేస్తూనే మధ్యలో షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశా. అవి మేధీ కి లడ్డూ' 'ఖైద్', 'ది టర్న్ ఎహెడ్. కునాల్ సేన్ అనే మార్కెటింగ్ ప్రొఫెషనల్ని 2014లో పెండ్లి చేసుకున్నా 'మీట్ క్యూట్' చాలా నచ్చింది. అందులో మిగతా స్టోరీస్తో పోలిస్తే, నా స్టోరీ నాకు చాలా వచ్చింది. డైరెక్టర్ దీప్తి గంట డెబ్యూ అయినా బాగా తీశారు. 0 నానితో కలిసి నటించకపోయినా, మరోసారి తనతో పనిచేసేందుకు ఇది ఇంకో అవకాశం. నాని చాలా మంచి వ్యక్తి. 'దేవ్స్'లో కలిసి పనిచేసినప్పుడు తనని గమనించా. తన యాక్టింగ్ నేచురల్ గా ఉంటుంది. ఎఫర్ట్ లెస్ గా చేస్తాడు.

- ప్రజ్ఞ