
హైదరాబాద్, వెలుగు : 2023 ఏడాదికిగానూ నేషనల్ అవార్డుల కోసం రాష్ట్రంలోని సర్కారు, ఎయిడెడ్ స్కూల్స్ టీచర్లు, హెడ్మాస్టర్ల దరఖాస్తు చేసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. ఆన్లైన్లో కేంద్ర విద్యాశాఖ వెబ్ సైట్ https://nationalawardstoteachers.education.gov.in ద్వారా జులై 15లోగా రిజిస్ర్టేషన్ చేసుకోవాలని సూచించారు. ఇతర గైడ్లైన్స్ కూడా కేంద్ర స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో ఉన్నాయని పేర్కొన్నారు.