IOCL Recruitment 2024: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 473 అప్రెంటిస్ పోస్టులు

IOCL Recruitment 2024: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 473  అప్రెంటిస్ పోస్టులు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ అప్లికేషన్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేది వరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.  మొత్తం 473 పోస్టులను భర్తీ చేయనుంది. 

ఐఓసీఎల్ రిక్రూట్మెంట్ 2024 ఏజ్ లిమిట్ : ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అభ్యర్థుల వయస్సు జనవరి 12, 2024 నాటికి కనిష్ఠంగా 18 ఏళ్లు, గరిష్టంగా 24 ఏళ్లు ఉండాలి.  రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఇవ్వబడుతుంది.

ఎవరు అర్హులంటే.?

టెక్నీషియన్ అప్రెంటిస్- మెకానికల్/ఎలక్ట్రికల్/టెలీకమ్యూనికేషన్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ - సంబంధిత సబ్జెక్టులో మూడేళ్ల పూర్తిస్థాయి డిప్లొమా.
ట్రేడ్ అప్రెంటిస్ (అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్/అకౌంటెంట్) - ప్రభుత్వం నుండి బ్యాచిలర్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం. 
డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఫ్రెషర్ అప్రెంటీస్), డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్) - 12వ ఉత్తీర్ణత
అప్రెంటీస్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టీపుల్ చాయిస్ విధానంలో 4 ఆప్షన్లతో ఉంటుంది. రాత పరీక్షకు 100 మార్కులు ఉంటాయి. కటాఫ్ మార్క్స్ ఉండవు.

ఎలా అప్లై చేసుకోవాలంటే.?

  •  ముందుగా ఐఓసీఎల్ అధికారిక వెబ్ సైట్ iocl.com ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో కనిపించే కెరీర్స్ లింక్ పై క్లిక్ చేయాలి
  •  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు అప్రెంటిస్ లింక్ పై క్లిక్ చేయాలి
  • రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి
  •  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి
  •  ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి
  • సబ్మిట్ పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి
  •   పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్ సైట్  iocl.com లోని సమగ్ర నోటిఫికేషన్ ను పరిశీలించాలి.

అవసరమైన డాక్యుమెంట్స్

  • టెన్త్ పాస్, సర్టిఫికెట్
  • SC/ST/OBC/వైకల్యం/EWS-ఆదాయం & ఇన్ కం  సర్టిఫికేట్
  • మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్