భవిష్యత్ నానో టెక్నాలజీదే : కృపా శంకర్

భవిష్యత్ నానో టెక్నాలజీదే : కృపా శంకర్
  •     ఇప్కో రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్

 సంగారెడ్డి (హత్నూర), వెలుగు : నానో టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో  పెను మార్పులు వస్తాయని ఇప్కో రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్, ఏడీఏ అరుణ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామ శివారులోని రైతు వేదికలో ఇఫ్కో, తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నానో యూరియా, డీఏపీ పిచికారీపై రైతులకు అవగాహన సదస్సు  నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  నానో టెక్నాలజీ వాడడంతో కూలీల కొరతను అధిగమించడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ హుస్సేన్, వ్యవసాయ అధికారులు శ్రీనివాసరావు, ప్రేమలత, ప్రేమ్ రాజ్, ఫీల్డ్ మేనేజర్ చంద్రన్న, సాయి కృష్ణ, ఇఫ్కో సేల్స్ మేనేజర్ రాజేశ్, రైతులు పాల్గొన్నారు.