Amazon Holi Offers: ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్

Amazon Holi Offers:  ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్

డిస్కౌంట్ ఆఫర్స్..అమెజాన్ హోలీ ఆఫర్స్.. మరో రెండు రోజుల్లో హోలి పండుగ ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. యాపిల్, సామ్ సంగ్ , ఓన్ ప్లస్ వంటి బ్రాండెడ్ కంపెనీల నుంచి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ భారీ డీల్స్, హోలీ ఆఫర్లను అందిస్తోంది.రీజనబుల్ ధరలతో స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇది సరియైన టైం. అమెజాన్ ఏయే స్మార్ట్ ఫోన్లను ఆఫర్లపై అందిస్తుందో లిస్ట్ చూద్దాం..  

iPhone 15

ఆకర్షణీయమైన ఫీచర్లు, కలర్లతో మీరు ఎంతో ఇష్టపడే iPhone 15 ను యాపిల్ ఇటీవల లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినీ XDR డిస్ ప్లేతో iPhone 14 కంటే 2X బ్రైట్ నెస్ తో అందుబాటులో ఉంది. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ స్మార్ట్ ఫోన్ డైనమిక్ ఐస్ లాండ్ ఫీచర్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఫాస్ట్ యాక్సెస్ కు A16 బయోనిక్ చిప్ సెట్, ఫోటోగ్రఫీ కోసం 48 MP కెమెరా, రోజంతా వచ్చే బ్యాటర్ పవర్ కలిగి ఉంది.  దీని ధర రూ. 71,290(డిస్కౌంట్ తో).. దీని అసలు ధర రూ. 79,900 లు .

One Plus 12

One Plus 12 స్మార్ట్ ఫోన్ లో 120 Hz  రిఫ్రెష్ రేట్, 2K Pristine డిస్ ప్లే, Qualcomm snapdragon 8 Gen 3 సిస్టమ్ తో మృదువుగా , పవర్ ఫుల్ పనితీరును కనబరుస్తుంది. ఫొటోగ్రఫి కోసం IOS తో 50MP సోని LYT808 కెమెరా, 64MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా, 48 MP అల్ట్రా వైర్ కెమెరా ఉన్నాయి. 5400mAh సామర్థ్యం గల బ్యాటరీ, 100W సూపర్ వూక్ వైర్డ్ ఛార్జర్ సపోర్ట్, 50 W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ స్మార్ ఫోన్ Oxygen OS ఆధారంగా నడిచే ఆండ్రాయిడ్ 14 సిస్టమ్ ను కలిగి ఉంది.దీని ధర రూ. 69,999

iQoo 12 5G

అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్న మరో స్మార్ట్ ఫోన్ iQoo 12 5G. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్ ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, 3000 nits బ్రైట్ నెస్, తడిచేతులతో కూడా ఆపరేట్ చేసే టెక్నాలజీని కలిగి ఉంది. Adreno 750 GPU తో నిర్మించిన Qualcomm Snapdrogon 8Gen 3 చిప్ సెట్, 12 GB RAM, 256 GB స్టోరేజ్ ఉంది. IOSతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 3X ఆప్టికల్ జూమ్ తో 64 MP టెలిఫొటో కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ సెన్సార్ కెమెరా ఇందులో ప్రత్యేకతలు. సెల్ఫీ లకోసం 16MP  ఫ్రంట్ సెల్ఫీ షూటర్, 5000 mAh గ్రాఫైట్ బ్యాటరీ, 120 W ఫ్లాష్ ఛార్జింగ్  చార్జర్ కు సపోర్ట్ చేస్తుంది. 

దీని ధర రూ. 57,999 (డిస్కౌంట్ తర్వాత ), అసలు ధర రూ. 64,999

Samsung Galsxy S23 Ultra 5G: 

Samsung Galsxy S23 Ultra 5G మార్కెట్లో క్రేజ్ ఉన్న స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.8అంగుళాల డైనమిక్ AMOLED డిస్ ప్లే, 120 Hz రీఫ్రెష్ రేట్,1750 nits  పీక్ బ్రైట్ నెస్ కు సపోర్ట్ చేసే డిస్ ప్లే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప 8 Gen  2 ప్రాసెసర్, ఫొటో గ్రఫీ కోసం 200MP  వైడ్ కెమెరా, 10 MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000mAh సామర్థ్యం గల బ్యాటరీ,45 W వైర్డ్ ఛార్జర్ కు సపోర్ట్ చేస్తుంది. 

దీని ధర రూ. 93,400 (డిస్కౌంట్ తర్వాత), అసలు ధర రూ. 1,49,999