Cyber crime: కాల్ ఫార్వాడింగ్ కోడ్ తో ఐ ఫోన్లు హ్యాక్

Cyber crime: కాల్ ఫార్వాడింగ్ కోడ్ తో ఐ ఫోన్లు హ్యాక్


సైబర్ నేరగాళ్లు సాధారణ ప్రజలతోపాటు నేతలు, మంత్రులను టార్గెట్‌‌‌‌ చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ చలాన్స్‌‌‌‌, ఆర్టీఏ, పీఎం కిసాన్‌‌‌‌ యోజన, ఎస్‌‌‌‌బీఐ రివార్డ్స్‌‌‌‌తో పేరుతో ఏపీకే (ఆండ్రాయిడ్‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌ ప్యాకేజీ/.apk) ఫైళ్లను పంపి అకౌంట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు.. తాజాగా తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా ఎంటరయ్యారు. మంత్రులు ఉన్న గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ పంపి, హ్యాకింగ్ కు ప్రయత్నించారు. 

కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్వర్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఐఫోన్లు హ్యాక్.. 

ఐఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినియోగదారులను సైతం కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్వర్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 21 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ # లాంటి నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని చెబుతున్నారు. నిజానికి ఇది కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్వర్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఈ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంటర్ చేసిన వెంటనే ఓటీపీలు, వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 
కాకుండా సైబర్ నేరగాళ్లకు వెళ్తుంటాయి. ఇలా ఐఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడే వారి వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు ప్రస్తుతం మన వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆర్టీఏ చలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేవైసీ, కొరియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లింపులు, వీడియో, ఫొటో షేరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరిట ఒక మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపుతున్నారు. దానితో పాటు ఒక ఏపీకే ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లింకు చేస్తారు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించే ప్రతి అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏపీకే ఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగిలించి సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో లింకులు పంపుతున్నారు. ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓపెన్ చేసిన వెంటనే మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుంది. దాంతో వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా మొబైల్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం సైబర్ నేరగాళ్ల కంట్రోల్ లోకి వెళ్తుంది.