ఇవాళ్టి నుంచి IPL 12వ సీజన్

ఇవాళ్టి నుంచి IPL 12వ సీజన్

దేశంలో పొలిటికల్‌‌‌‌‌‌‌‌ హీట్‌ కు క్రికె ట్‌ వేడి కూడాతోడైంది. రాజకీయ ప్రచారాలకు పోటీగా ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ (IPL‌‌‌‌‌‌‌) 2019 హంగామా శనివారం నుంచి మొదలవుతోంది. ఏటా జరిగే ఈ మెగా క్రికెట్‌ ఈవెంట్‌ మరో సారి రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను అలరించబోతోంది. ఈ ఏడాది ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ తర్వా త వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ జరగనున్న నేపథ్యంలో పలువురు స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లకు తోడు కొత్త కుర్రాళ్లు కూడా పరుగుల పండుగ చేసి తమ దేశం తరపున ఆడేందుకు రెడీ అవుతున్నారు . 2011,2015లో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌కు ముందు ప్రపంచ కప్‌‌‌‌‌‌‌‌ జరిగితే.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ తర్వాత వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ జరగడం ఇదే తొలిసారి. దీంతో వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో ఆడే ఆటగాళ్లపై ఈ టోర్నీ వర్క్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ పెంచుతుందన్న ఇండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ వ్యాఖ్యలు, పనిభారంపై ఆ తర్వాత జరిగిన చర్చోపచర్చల నేపథ్యం లో ఈ ఏడాది ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఆటగాళ్ల ఆటతీరు ఆసక్తి రేపుతోం ది. కోట్లు కుమ్మరించి కొనుకున్న ఫ్రాంజైజీల ఆశలు నిలపాలన్న ఉత్సాహంతో సీనియర్లకు తోడుగా యువ ప్లేయర్లు ఈ టోర్నీలో బ్యాట్‌ కు పనిచెప్పబోతున్నారు . ఇప్పటి వరకూ 11 సార్లు జరిగిన ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ మొత్తం ఎనిమిది జట్ల మధ్య తిరిగింది. చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ధోనీ మూడు సార్లు తన జట్టును విజేతగా నిలిపి నాలుగో సారి ఆ ఘనత సాధించేందుకు సిద్ధమవుతున్నా డు. ఇక టీమిండియాకు సూపర్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఎన్నో విజయాలను అందించిన విరాట్‌ కోహ్లీకి మాత్రం ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ అందని ద్రాక్షలా మిగిలింది.ఎనిమిదేళ్ల నుంచి తన జట్టు రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెం గళూరుకు కోహ్లీ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ టైటిల్ మాత్రం అందించలేకపోయాడు. అయితే ఈ సారి మాత్రం తన జట్టు ను ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ విజేతగా నిలుపుతానన్న కోహ్లీ వ్యాఖ్యలతో ఈ టోర్నీ మరింత ఆసక్తికరంగా మారింది.ధనాధన్‌‌‌‌‌‌‌‌ దంగల్ –2019లో కోహ్లీ ఆటతీరు ఎలా ఉండబోతోందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . వీరితో పాటు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో మరో మోస్ట్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ కూడా చెన్నైకి పోటీగా తమ జట్టు ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌కు నాలుగో సారి టైటిల్‌‌‌‌‌‌‌‌ అందించాలని పట్టుదలతో ఉన్నా డు. వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ నేపథ్యం లో రోహిత్‌‌‌‌‌‌‌‌ ఒత్తిడిని ఎలా జయిస్తాడు…హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా , బూమ్రా ప్లేయర్లపై ఎలాంటి భారంమోపనున్నాడో అన్నదే ఆసక్తికరమైన అంశం. పేరుకు తగ్గట్టే రాజస్థా న్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌ కూడా స్టార్‌‌‌‌‌‌‌‌ ఆటగాళ్లతో కళకళలాడుతోంది. వన్డే జట్టు కు దూరమైనప్పటికీ రహానే ఈ టోర్నీలో రాజస్థా న్‌‌‌‌‌‌‌‌ను మిగతా జట్ల కంటే ముందు నిలపాలన్న పట్టు దలతో ఉన్నా డు. నిషేధం తర్వాత కసితో గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో అడుగుపెట్టబోతున్న స్టీవ్‌ స్మిత్‌‌‌‌‌‌‌‌తో పాటు బెన్‌‌‌‌‌‌‌స్టో క్స్‌‌‌‌‌‌‌‌, జోస్‌‌‌‌‌‌‌‌ బట్ల ర్ మెరుపు లతో ప్లే ఆఫ్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌ ఖాయం చేసుకున్నప్పటికీఈ సారి ఆ గండం కూడా దాటాలన్న ఆశతో ఉంది. గతం కంటే భిన్నంగా ఈసారి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌తో తమ జట్టు ను చూస్తారని, అన్ని జట్ల కంటే కింగ్స్‌‌‌‌‌‌‌‌ లెవెన్‌‌‌‌‌‌‌‌ పంజాబ్‌ దే పై చేయి అవుతుందని వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో ఆడే డియా జట్టు లో బెర్త్‌‌‌‌‌‌‌‌పై ఆశలొదిలేసుకున్న ఆ జట్టు కెప్టెన్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌ కొండంత ఆశతో చెబుతున్నా డు. ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌గా పేరు మార్చుకున్న ఢిల్లీ ఈ సారి అదృష్టం కూడా మారబోతోందని కాన్ఫిడెంట్‌ గా ఉంది. గతంలో ఎప్పుడో చాంపియ న్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్‌ రైడర్స్‌‌‌‌‌‌‌‌ను మళ్లీ విజేతగా నిలపాలన్న ఫ్యా న్స్‌‌‌‌‌‌‌‌ ఆశలు తీర్చేం దుకు కె ప్టెన్‌‌‌‌‌‌‌‌ దినేశ్‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌ తనపై ఉన్న పెనుభారాన్ని ఎలా తగ్గించుకుంటాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు . పదునైన బౌలింగ్‌‌‌‌‌‌‌‌ అస్త్రంగా ఈ సారి బరిలో దిగుతున్న సన్‌‌‌‌‌‌‌‌రై జర్స్‌‌‌‌‌‌‌‌కు వార్నర్‌‌‌‌‌‌‌‌ రాక మరింత బలం పెంచింది. ఈ సారి రషీద్‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ ట్రంప్‌‌‌‌‌‌‌‌కార్డ్‌‌‌‌‌‌‌‌ కాబోతున్నాడు. వెటరన్ ప్లే యర్లు గేల్‌‌‌‌‌‌‌‌, డివిలియర్స్‌‌‌‌‌‌‌‌, యువరాజ్‌‌‌‌‌‌‌‌లతో పాటు శుభమన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌, పృథ్వీ షా, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ 2019 మోస్ట్‌‌‌‌‌‌‌‌ వాల్యు బుల్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ వరుణ్‌ చక్రవర్తి, ప్రయాస్‌‌‌‌‌‌‌‌ రే, సిమ్రన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌   ఈ ఏడాది రన్‌‌‌‌‌‌‌‌ రంగస్థలంలో హీరోలయ్యేందుకు సిద్ధమయ్యారు.