ఆరు నగరాల్లోనే ఐపీఎల్‌-14.. హైదరాబాద్‌కు దక్కని భాగ్యం

ఆరు నగరాల్లోనే ఐపీఎల్‌-14.. హైదరాబాద్‌కు దక్కని భాగ్యం
  • ఈనెల మొదటి వారంలో గవర్నింగ్‌ కౌన్సిల్‌ మీట్‌

ఐపీఎల్‌‌–14పై భారీ ఆశలు పెట్టుకున్న క్రికెట్‌‌ అభిమానులకు ఓ రకంగా గుడ్‌‌న్యూస్‌‌.. మరో రకంగా బ్యాడ్‌‌ న్యూస్‌‌..! దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వేదికల సంఖ్యను బీసీసీఐ కుదించింది..! దీనికితోడు స్టేడియంలోకి ఫ్యాన్స్‌‌ను అనుమతించే అంశంపై సందేహాలు మొదలయ్యాయి..! ఇప్పటివరకు అధికారింగా ఏ విషయాన్ని ప్రకటించకపోయినా.. తెర వెనుక మాత్రం మెగా లీగ్‌‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నట్లు తెలుస్తోంది..! ఇక ఉప్పల్‌‌ స్టేడియంలో మ్యాచ్‌‌లను తిలకించాలని భారీ ఆశలు పెట్టుకున్న భాగ్యనగర వాసులకు ఈసారి ఆ భాగ్యం లేనట్లుగానే కనిపిస్తోంది..! ఓవరాల్‌‌గా హైదరాబాద్‌‌, జైపూర్‌‌, చండీగఢ్‌‌లో మ్యాచ్‌‌ల నిర్వహణకు ఐపీఎల్‌‌ నిర్వాహకులు ‘నో’ చెప్పినట్లు సమాచారం…!!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌–2021కు సంబంధించిన ఏర్పాట్లలో బీసీసీఐ వేగం పెంచింది. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్‌‌ ప్రకారం ఆరు నగరాల్లో లీగ్‌‌ను నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. ఈ మేరకు చెన్నై, కోల్‌‌కతా, అహ్మదాబాద్‌‌, బెంగళూరు, ఢిల్లీని షార్ట్‌‌ లిస్ట్‌‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్‌‌ లేకుండా మ్యాచ్‌‌ల నిర్వహణకు మహారాష్ట్ర గవర్నమెంట్‌‌ పర్మిషన్‌‌ ఇవ్వడంతో.. శనివారం సాయంత్రం ముంబైని కూడా లిస్ట్‌‌లో చేర్చింది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్‌‌ పాలక వర్గం  దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రిలీజ్‌‌ చేయలేదు. ఫ్రాంచైజీ ఓనర్స్‌‌ వద్ద కూడా అఫిషీయల్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ లేదు. ‘ఐపీఎల్‌‌కు సంబంధించిన అన్ని విషయాలను మీడియాలో  చూసే తెలుసుకుంటున్నాం.  వేదికలు, షెడ్యూల్‌‌, టైమ్‌‌ గురించి ఐపీఎల్‌‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మా హోమ్‌‌ సిటీలో మ్యాచ్‌‌లు లేకపోవడం వల్ల ఫ్యాన్స్‌‌ బాగా హర్ట్‌‌ అవుతారు. మా నగరాల్లో మ్యాచ్‌‌లు నిర్వహించకపోవడం ఇది రెండో ఏడాది అవుతుంది. దీనివల్ల ఫ్రాంచైజీలకు బాగా నష్టం వస్తుంది’ అని ఓ ఫ్రాంచైజీ మెంబర్‌‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

కారవాన్‌‌ మోడల్‌‌లో…

కొవిడ్‌‌ నేపథ్యంలో ట్రావెలింగ్‌‌ను తగ్గించాలని భావిస్తోన్న బీసీసీఐ… ఈసారి లీగ్‌‌ కోసం ‘కారవాన్‌‌ మోడల్‌‌’ను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా టీమ్‌‌లను రెండు గ్రూప్‌‌లుగా విడగొడతారు. ఆ గ్రూప్‌‌కు సంబంధించిన మ్యాచ్‌‌లను ఒకే సిటీలో నిర్వహిస్తారు. నెక్ట్స్‌‌ లెగ్‌‌ మ్యాచ్‌‌ల కోసం మరో సిటీకి వెళ్తాయి. చివరకు నాకౌట్‌‌ మ్యాచ్‌‌లను మరో నగరంలో నిర్వహించే విధంగా ప్లాన్‌‌ చేస్తున్నారు. అయితే దీనికి ఐపీఎల్‌‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఇక ఏప్రిల్‌‌ 11 నుంచి లీగ్‌‌ను మొదలుపెట్టాలని బోర్డు భావిస్తోంది. ఈ నెల 8న ఇండియా, ఇంగ్లండ్‌‌ మధ్య నాలుగో టెస్ట్‌‌ ముగుస్తుంది. ఆ వెంటనే క్రికెటర్లకు కాస్త రెస్ట్‌‌ ఇచ్చి లీగ్‌‌ను మొదలుపెట్టే చాన్స్‌‌ ఉంది. మరోవైపు నెల రోజుల అడ్వాన్స్‌‌గా ఫుల్‌‌ షెడ్యూల్‌‌ను రిలీజ్​చేయాలని బ్రాడ్‌‌కాస్టర్స్‌‌ కోరినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రతి వేదికలో మ్యాచ్‌‌లకు సంబంధించిన అరెంజ్‌‌మెంట్స్‌‌ చేసుకోవాల్సి ఉండటమే ఇందుకు కారణం.

ఫస్ట్‌‌ వీక్‌‌లో జీసీ

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల ఫస్ట్‌‌ వీక్‌‌లో ఐపీఎల్‌‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ (జీసీ) మీటింగ్‌‌ జరగనుంది. ఇందులో లీగ్‌‌కు సంబంధించిన వేదికలు, తేదీలు, షెడ్యూల్‌‌ను ఫైనలైజ్‌‌ చేసే చాన్స్‌‌ ఉంది. అంతకంటే ముందే ఐపీఎల్‌‌ చైర్మన్‌‌ బ్రిజేశ్‌‌ పటేల్‌‌, బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ, సెక్రటరీ జై షా మధ్య మీటింగ్‌‌ జరగనుంది. ఐపీఎల్‌‌ను ఎక్కడ నిర్వహించాలనే దానిపై కచ్చితమైన ఫైనల్‌‌ డెసిషన్‌‌ను ఈ ముగ్గురు కలిసి తీసుకోనున్నారు. ఆరు నగరాలను షార్ట్‌‌ లిస్ట్‌‌ చేశారు కాబట్టి ఇండియాలోనే లీగ్‌‌ జరుగుతుందని సంకేతాలైతే వచ్చాయి. అయితే కొవిడ్‌‌ కేసులు పెరిగినా, మరేమైనా అనుకోని పరిణామాలు సంభవించినా.. సెకండ్‌‌ ఆప్షన్‌‌గా యూఏఈని కూడా అందుబాటులో ఉంచుకోవాలని లీగ్‌‌ పెద్దలు భావిస్తున్నారు. ‘ఇండియాలో పరిస్థితిని బీసీసీఐ మానిటర్​ చేస్తున్నది. ఇప్పటివరకు లీగ్‌‌పై ఎలాంటి డెసిషన్‌‌కు రాలేదు. కొవిడ్‌‌ కేసులు పెరిగితే ఎలా అన్న దానిపై కూడా ఓ నిర్ణయానికి వస్తాం’ అని బీసీసీఐ ట్రెజరర్‌‌ అరుణ్‌‌ ధుమాల్‌‌ వెల్లడించాడు.

భాగ్యనగరంలో నో మ్యాచెస్‌‌!

దేశంలో వివిధ నగరాల్లో్ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌‌ మ్యాచ్‌‌లకు హైదరాబాద్‌‌ ఫ్రంట్‌‌ రన్నర్‌‌గా నిలుస్తుందని భావించిన సగటు అభిమాని, ఫ్రాంచైజీ మేనేజ్‌‌మెంట్‌‌కి బోర్డు షాకివ్వబోతున్నది. ఫస్ట్‌‌ రౌండ్‌‌ చర్చల్లో భాగంగా.. బోర్డు షార్ట్‌‌ లిస్ట్‌‌ చేసిన నగరాల్లో హైదరాబాద్‌‌ పేరు లేదు. దీంతో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ టీమ్‌‌కు హోమ్‌‌ అడ్వాంటేజ్‌‌ ఉండదు. చండీగఢ్‌‌, జైపూర్‌‌ను కూడా లిస్ట్‌‌ పెట్టకపోవడంతో.. రాజస్తాన్‌‌ రాయల్స్‌‌, పంజాబ్‌‌ కింగ్స్‌‌కు కూడా ఇదే  ప్రాబ్లమ్‌‌ ఎదురుకానుంది.  ఇప్పటికే సన్‌‌రైజర్స్‌‌లో లోకల్‌‌ ప్లేయర్ల్స్‌‌ లేరని ఆందోళన చేస్తున్న చాలా మంది ఫ్యాన్స్‌‌కు.. ఈసారి మ్యాచ్‌‌లు కూడా లేకపోవడం నిరాశ కలిగించే అంశం.

ఐపీఎల్‌‌ వేదికల్లో హైదరాబాద్‌‌ను చేర్చండి

హైదరాబాద్‌‌, వెలుగు: ఐపీఎల్‌‌ వేదికల్లో హైదరాబాద్‌‌ను చేర్చాలని మంత్రి కేటీఆర్‌‌…  బీసీసీఐ, ఐపీఎల్‌‌ నిర్వాహకులను కోరారు. ఈ మేరకు ఆదివారం ట్వీటర్‌‌లో విజ్ఞప్తి చేశారు. వచ్చే ఐపీఎల్‌‌ సీజన్‌‌ను హైదరాబాద్‌‌లో నిర్వహించాలని కోరారు. మిగతా మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌‌లో కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉందని తెలిపారు. అందుకు ఇక్కడ రికార్డు అవుతున్న కేసుల సంఖ్యే నిదర్శనమన్నారు. మ్యాచ్‌‌ల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం తరపున అవసరమైన మద్దతు అందజేస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మహిళా దినోత్సవం కోరిక ఆమెదే

టెట్​ లేకుండానే టీచర్స్ రిక్రూట్​మెంట్​కు సర్కార్ ఆలోచన

మన్యంలో శిలాయుగం గుర్తులు

లాభాల్లో ఉన్నా ప్రైవేటైజేషన్.. ఎవరి కోసం?