పంజాబ్‌ పై హైదరాబాద్‌ గ్రాండ్‌ విక్టరీ

పంజాబ్‌ పై హైదరాబాద్‌ గ్రాండ్‌ విక్టరీ
  • ఆఖరి మ్యాచ్ లో చెలరేగిన డేవిడ్‌
  • కింగ్స్‌ లెవెన్‌ కు హ్యాట్రిక్‌ ఓటమి

 

పోతూ పోతూ పంజాబ్‌ బౌలర్లపై డేవిడ్‌ వార్నర్‌ పంజా విసిరాడు. ఐపీఎల్‌ పన్నెండో సీజన్‌ లో భీకర ఫామ్‌ లో ఉన్న వార్నర్‌ తన ఆఖరి పోరులోమరింత రెచ్చి పోయాడు. అద్భుత బ్యాటింగ్‌ తో ఆరెం జ్‌ ఆర్మీ ఫాన్స్‌ కు మజా అందిం చాడు. వార్నర్‌ తో పాటు బౌలర్లు కూడా సత్తా చాటడంతో హోమ్‌ గ్రౌండ్‌ లో పంజాబ్‌ ను చిత్తు చేసిన హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ రేసులో ముందంజ వేసింది. మరోవైపు బౌలింగ్‌ వైఫల్యం తో ప్రత్యర్థికి భారీ స్కోరు ఇచ్చుకున్న పంజాబ్‌ హ్యాట్రిక్‌ ఓటమితో నాకౌట్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

 

హైదరాబాద్‌‌, వెలుగు: చావోరేవో మ్యా చ్‌ లో సన్‌ రైజర్స్‌‌ హైదరాబాద్‌ సత్తా  చాటింది. లీగ్‌ లో ఆఖరి మ్యాచ్‌ ఆడిన డేవిడ్‌ వార్నర్‌ కు విజయంతో వీడ్కోలు పలికింది. వార్నర్‌ (56 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 81) ధనాధన్‌ బ్యాటింగ్‌ కు రషీద్‌ ఖాన్‌ (3/21),ఖలీల్‌ అహ్మద్‌ (3/40) అద్భుత బౌలిం గ్‌ తోడవడంతో ఉప్పల్‌ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌ లో హైదరాబాద్‌ 45 రన్స్‌‌ తేడాతో కింగ్స్‌‌ లెవెన్‌ పంజాబ్‌ ను చిత్తుగా ఓడించిం ది. తొలుత వార్నర్‌ ధాటికి సన్‌ రైజర్స్‌‌ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. వార్నర్‌ తో పాటు మనీశ్‌పాండే (36), వృద్ధిమాన్‌ సాహా (28), మహ్మద్‌ నబీ (20) మెరుపులు మెరిపించారు. ఛేజింగ్‌ లో 20 ఓవర్లు ఆడిన పంజాబ్‌ వికెట్లకు మాత్రమే చేసి ఓడిపోయింది.కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో79) ఒంటరి పోరాటం వృథా అయింది.

రాహుల్‌ ఒక్కడే

భారీ ఛేజింగ్‌ లో పంజాబ్‌ కు ఆరంభంలో నే షాక్‌తగిలింది. యూనివర్స్‌‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ (4)ను సింగిల్‌ డిజిట్‌ కే పెవిలియన్‌ కు పంపి ఖలీల్‌ అహ్మద్‌ పంజాబ్‌ కు షాకిచ్చాడు . అయితే ఖలీల్‌ బౌలింగ్‌ లో భారీ సిక్సర్‌ కొట్టిన మరో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ ..వన్‌ డౌన్‌ బ్యాట్స్‌‌మన్‌ మయాంక్‌ అగర్వా ల్‌ (27)తోకలిసి ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు.కానీ, తొమ్మిదో ఓవర్లో మయాంక్​ను  ఔట్​ చేసిన రషీద్‌ పంజాబ్​ను దెబ్బకొట్టాడు . అయితే, నికోలస్‌ పూరన్‌ (21) భారీషాట్లతో రెచ్చిపోయాడు. నబీ బౌలిం గ్‌ లో సిక్సర్‌ ,ఖలీల్‌ వేసిన 11వ ఓవర్లో 6, 4, 4 బాది హోమ్‌‌టీమ్‌‌లో గుబులు రేపాడు. కానీ, అదే ఓవర్లో స్క్వేర్‌ లెగ్‌బౌండ్రీ దగ్గర భువీ పట్టిన చురుకైన క్యాచ్‌ కు అతను వెనుదిరిగాడు. ఆ వెంటనే మిల్లర్‌ (11)తోపాటు కెప్టె న్‌ అశ్వి న్‌ (0) వరుస బంతుల్లో ఔట్‌ చేసిన రషీద్‌ ఖాన్‌ పంజాబ్‌ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు . కానీ జోరు కొనసాగించిన రాహుల్.. నబీ బౌలింగ్ లో రెండు సిక్సర్లు బాదీ సెంచరీ హాఫ్ పూర్తి చేసుకున్నాడు. భువీ వేసిన 16వఓవర్ల 6, 4 బాదినలోకేశ్‌ .. సందీప్‌ బౌలింగ్‌ లో సింగిల్‌ హ్యాండ్‌ తో సిక్సర్‌ కొట్టాడు . కానీ, అప్పటికే సాధించాల్సిన రన్‌ రేట్‌ 20 దాటింది. వేగంగా ఆడే ప్రయత్నంలో ఖలీల్‌ వేసిన 19వ ఓవర్లో బౌలింగ్‌ లో రాహుల్‌  ఔటవడంతో పంజాబ్‌ కు భారీ ఓటమి తప్పలేదు.

వార్నర్‌ .. షో మ్యాన్‌

వృద్ధిమాన్‌ సాహాను డేవిడ్‌ వార్నర్‌ కు జతగా ఓపెనిం గ్‌ పంపిన సన్‌ రైజర్స్‌‌ మంచి ఫలితాన్నేరాబట్టిం ది. డేవిడ్‌ వార్నర్‌ షో కొనసాగడంతో 15 ఓవర్లు వరకు మ్యాచ్‌ లో ఆరెంజ్‌ ఆర్మీఆధిపత్యమే కొనసాగింది. గత మ్యాచ్‌ లో విఫలమైన సాహా ఉన్నంతసేపు  భారీ షాట్లతో అలరించాడు. 38 బంతుల్లో 78 పరుగులు జోడించిన వార్నర్‌ , సాహా జోడీ టాస్‌ ఓడి ఫస్ట్‌ బ్యాటింగ్‌ కు దిగిన రైజర్స్‌‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. తొలి నాలుగో ఓవర్లలోనే యాభై పరుగులు జోడించి సీజన్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ పార్ట్‌ నర్‌ షిప్‌ రికార్డు నమోదు చేసింది. పవర్‌ప్లేలోనే  సన్‌ రైజర్స్‌‌ వికెట్‌ కోల్పోకుండా 77రన్స్‌‌ చేసింది. ఈ సీజన్‌ లో ఏ జట్టుకైనా ఇదే బెస్ట్‌ పవర్‌ ప్లే స్కోరు కావడం విశేషం. అయితే ధాటిగా ఆడుతున్న సాహాను ఏడో ఓవర్లో ఔట్‌ చేసిన మురుగన్‌ అశ్విన్‌ పంజాబ్‌ కు తొలి బ్రేక్‌ ఇచ్చాడు. వన్‌ డౌన్‌ లో వచ్చిన మనీశ్‌ పాండే తోకలిసి వార్నర్‌ జాగ్రత్త ఆడడంతో పది ఓవర్లు ముగిసే సరికి రైజర్స్‌‌ 103 పరుగులు చేసింది.తర్వా త మురుగన్‌ బౌలిం గ్‌ లో ఓ ఫోర్‌ కొట్టిన పాండే కి షమీ వేసిన 12వ ఓవర్లో ఔటయ్యే ప్రమాదం తప్పింది. ఆ ఓవర్‌ ఫస్ట్‌ బాల్‌ కు పాండే ఇచ్చిన క్యా చ్‌ ను అశ్వి న్‌ నేలపాలు చేశాడు.తర్వా తి బంతికి బౌండరీ కొట్టిన వార్నర్‌ ఈ సీజన్‌ లో ఎనిమిదో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.మురుగున్‌ వేసిన 13వ ఓవర్‌ లో పాండే భారీ సిక్స్‌‌ కొట్టగా, ముజీబ్‌ వేసిన తర్వాతి ఓవర్‌ లోవార్నర్‌ స్వి చ్‌ షాట్‌ తో బౌండ్రీ రాబట్టాడు . మరోఎండ్‌ లో పాండే కూడా ధాటిగా ఆడడంతో 15ఓవర్లకే 159/1తో నిలిచిన హైదరాబాద్‌ 220 రన్స్‌‌ చేసేలా కనిపించిం ది. కానీ, స్లాగ్‌ ఓవర్లలో పంజాబ్‌ పుంజుకుంది. 16 ఓవర్లో వార్నర్‌ , పాండే ను ఒకే ఓవర్‌ లో ఔట్‌ చేసి అశ్వి న్‌ హైదరాబాద్‌ జోరుకు బ్రేకులేశాడు. ఆ తర్వా తి ఓవర్లో షమీ ఆరు పరుగులే ఇచ్చినా ..ముజీబ్‌  వేసిన 18వ ఓవర్లో కేన్‌ విలియమ్సన్‌ (14) ఫోర్‌ , సిక్సర్‌ … మహ్మద్‌ నబీ రెండు సిక్సర్లతో రెచ్చిపోయారు. ఏకంగా 26 రన్స్‌‌ పించుకున్నారు . కానీ, తర్వా తి ఓవర్లనే షమీ ఈ ఇద్దరినీ పెవిలియన్‌ కు పంపాడు. అప్పటికే రైజర్స్‌‌ స్కోరు 200 మార్కు దాటేసింది. కానీ,లాస్ట్‌ ఓవర్‌ వేసిన అర్షదీప్‌ 10 పరుగులే ఇచ్చి రషీద్‌ ఖాన్‌ (1)ను ఔట్‌ చేశాడు.

స్కోర్‌ బోర్డు

హైదరాబాద్‌‌‌‌ : వార్నర్‌ (సి) ముజీబ్‌ (బి) అశ్వి న్‌81, సాహా (సి) సిమ్రన్‌ (బి) మురుగన్‌ 28,మనీశ్‌ (సి) షమీ (బి) అశ్వి న్‌ 36, నబీ (బి) షమీ20, విలియమ్సన్‌ (సి) మురుగన్‌ (బి) షమీ14, రషీద్‌ (బి) అర్షదీప్‌ 1, విజయ్‌ (నాటౌట్‌ )7, అభిషేక్‌ (నాటౌట్‌ ) 5 : ఎక్స్‌ ట్రాలు : 20 ;మొత్తం: 20 ఓవర్లలో 212/6 ;

వికెట్ల పతనం:1–78, 2–160, 3–163, 4–197, 5–198,6–202 ; బౌలింగ్‌ : అర్షదీప్‌ 4–0–42–1,ముజీబ్‌ 4–0–66–0, షమీ 4–0– 36–2,అశ్వి న్‌ 4–0–30–2, మురుగన్‌ 4–0–32–1.

పంజాబ్‌ : రాహుల్‌ (సి) విలియమ్సన్‌ (బి)ఖలీల్‌ 79, క్రిస్‌ గేల్‌ (సి) పాండే (బి) ఖలీల్‌ 4,మయాంక్‌ (సి) విజయ్‌ (బి) రషీద్‌ 27, పూరన్‌(సి) భువీ (బి) ఖలీల్‌ 21, మిల్లర్‌ (సి) విజయ్‌(బి) రషీద్‌ 11, అశ్వి న్‌ (సి) పాండే (బి) రషీద్‌0, సిమ్రన్‌ (ఎల్బీ ) సందీప్‌ 16, మురుగన్‌ (నా-టౌట్‌ ) 2, ముజీబ్‌ (బి) సందీప్‌ 0, షమీ(నాటౌ-ట్‌ ) 1; ఎక్స్‌ ట్రాలు : 7 ; మొత్తం : 20 ఓవర్లలో167/8 ;

వికెట్ల పతనం : 1–11, 2–71,3–95, 4–107, 5–107, 6– 160, 7–165,8–165 ; బౌలింగ్‌ : ఖలీల్‌ 4–0– 40–3, భు-వనేశ్వర్‌ 4–0–34–0, సందీప్‌ 4–0– 33–2,రషీద్‌ 4–0–21–3, అభిషేక్‌ 1–0–11–0, నబీ3–0–28–0.