
ఐపీఎల్ 12వ సీజన్ విజేతలుగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు ముంబైలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ వేదికగా కప్ గెలుచుకున్న రోహిత్ సేనకి… యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. సోమవారం సౌత్ ముంబైలోని ముకేశ్ అంబానీ నివాసం నుంచి.. జట్టు బస చేసిన ట్రైడెంట్ హోటల్ వరకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఓపెన్ టాప్ బస్ లోప్రయాణించారు. రోడ్డు కు ఇరువైపులా అభిమానులు కేరింతలు కొడుతుండగా, వెటరన్ స్టార్ యువరాజ్ ట్రోఫీతో కనువిందు చేశాడు. ముంబై ఆటగాళ్లందరూ.. బస్సు టాప్‌పై నిల్చొని అభిమానులకు అభివాదం చేశారు. ఈ ర్యాలీని తిలకించడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దారి పొడవున కేరింతలతో హోరెత్తించారు.టీమ్ ఓనర్ నీతా అంబానీ, కోచ్ జయవర్ధనే, మలింగ ఈ సంబురాల్లో పాల్గొన్నారు.