
న్యూఢిల్లీ: చెన్నై చిన్న తలగా పిలుచుకునే సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందే స్వదేశానికి తిరిగొచ్చాడు. రైనా నిష్క్రమణపై పలు ఊహాగానాలు వినిపించాయి. హోటల్ గదిలో తనకు కేటాయించిన రూమ్ నచ్చకనే రైనా వెళ్లిపోయాడని వదంతులు వినిపించాయి. దీనిపై ఆ ఫ్రాంచైజీ యజమాని శ్రీనివాసన్ స్పందిస్తూ.. కొందరికి విజయం తలకెక్కుతుంది అన్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే వీటిపై స్పందించిన రైనా.. తనకు దగ్గరి బంధువుల్లో ఒకరు మృతి చెందడం, పలువురు తీవ్ర గాయాల పాలవ్వడంతోనే ఇండియాకు వచ్చేశానన్నాడు. వీటిని పక్కనబెడితే వచ్చే సీజీన్ ఐపీఎల్ లో రైనా ఆడతాడా లేదా? ఆడినా ఏ టీమ్ కు ఆడతాడోననే విషయం పలు ఆసక్తి రెక్కిస్తోంది. ఈ తరుణలో దీనిపై రైనా స్పందించాడు.
‘అది వ్యక్తిగత విషయం. నేను నా ఫ్యామిలీ కోసం తిరిగి రావాల్సి వచ్చింది. హోమ్ ఫ్రంట్లోని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. సీఎస్కే నాకు కుటుంబం లాంటిది. ధోని భాయ్ నాకు చాలా కీలకం. అయినా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ కు నాకు మధ్య ఎలాంటి వివాదం లేదు. బలమైన కారణం లేకుండా ఎవరు కూడా రూ.12.5 కోట్లను అంత సులువుగా వదులుకోరు. నేను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరైనప్పటికీ.. చాలా యంగ్ గా ఉన్నా కాబట్టి రాబోయే 4-5 ఏళ్లు ఐపీఎల్ లో ఆడాలని అనుకుంటున్నా. ఇక్కడ క్వారంటైన్ లో ఉన్నప్పుడు కూడా నేను క్రికెట్ ప్రాక్టీస్ చేశా అని రైనా పపేరకన్