
కోల్ కతా: IPL-2020 వేల ప్రారంభం అయ్యింది. స్టార్ ఆటగాళ్లను ఎంత ధరైనా పెట్టి సొంత చేసుకుంటున్నాయి ప్రాంచైజైలు. ఈ క్రమంలోనే ఆస్ట్రెలియా ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ ను రూ.15.50 కోట్లు పెట్టి వేలంలో దక్కించుకుంది KKR. దీంతో ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ గుర్తింపు పొందాడు. ఫ్రాంచైజీలు కమిన్స్ కోసం పోటీ పడగా చివరకూ కేకేఆర్ కమిన్స్‌ను దక్కించుకుంది. అతనికి 10 కోట్ల వరకూ ధర పలుకుతుందని ఊహించనప్పటికీ అంతకుమించి కమిన్స్ అమ్ముడుపోవడం విశేషం.
RCBకి క్రిస్ మోరీస్
సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరీస్ ను RCB భారీ ధరపెట్టి దక్కించుకుంది. రూ. 10 కోట్లు పెట్టి వేలంలో పోటీపడి సొంతం చేసుకుంది.
స్టూవర్ట్ బిన్నీతో పాటు మరికొంత మంది భారత ప్లేయర్లపై ఆసక్తి చూపడంలేదు ప్రాంచైజైలు. మరికొన్ని గంటల్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
.@KKRiders say HI to @patcummins30 ??? @Vivo_India #IPLAuction pic.twitter.com/23jEGFaHKc
— IndianPremierLeague (@IPL) December 19, 2019