వయస్సు పెరిగిన ప్లేయర్లతో కష్టమని ముందే ఊహించాం

వయస్సు పెరిగిన ప్లేయర్లతో కష్టమని ముందే ఊహించాం

దుబాయ్: ఐపీఎల్‌‌లో అత్యంత సక్సెస్‌‌ఫుల్ టీమ్‌‌ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌‌ ఈ సీజన్‌‌లో పేలవ ప్రదర్శన చేస్తోంది. టోర్నీలో తొలిసారి ప్లేఆఫ్‌‌ అవకాశాలు పోగొట్టుకోవడానికి సీఎస్‌కే అంచున నిలిచింది. చెన్నై ఆడిన 10 మ్యాచుల్లో ఏడింట్లో ఓడి ఫ్యాన్స్‌‌తోపాటు సగటు క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. చెన్నై ఓటములపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు.

‘పాయింట్ టేబుల్‌‌లో మేం దిగువన ఉన్నాం. మూడేళ్ల వ్యవధిని చూసుకుంటే.. మొదటి ఏడాది మేం కప్ గెలిచాం. గతేడాది చివరి బంతికి ఓడాం. వయస్సు పెరుగుతున్న ప్లేయర్లతో మూడో సంవత్సరం కఠినంగా ఉంటుందని మేం ముందే ఊహించాం. ముఖ్యంగా దుబాయ్ మాకు కొత్త తరహా సవాళ్లు విసిరింది. నిజాయితీగా చెప్పాలంటే.. డ్రెస్సింగ్ రూమ్‌‌లో కొంత నమ్మకం సన్నగిల్లింది. కొన్ని మ్యాచుల్లో మేం విజయానికి చేరువగా వచ్చి ఓడిపోయాం’ అని ఫ్లెమింగ్ చెప్పాడు.