ఈసారి ఐపీఎల్ లో చెలరేగుతా

V6 Velugu Posted on Apr 05, 2021

చెన్నై: ఈసారి ఐపీఎల్ లో చెలరేగి ఆడతానని టీమ్ ఇండియా సీనియర్ సీనియర్ బ్యాట్స్ మన్ చటేశ్వర్ పుజారా అన్నాడు. లెజెండరీ ప్లేయర్ ద్రవిడ్ సలహాలను పాటిస్తున్నానని, పొట్టి ఫార్మాట్ కు తగ్గట్లు బ్యాటింగ్ ను మార్చుకుంటున్నట్లు తెలిపాడు. 'గతంలో టీ20ల్లో ఆడేటప్పుడు టెస్టులకు మళ్లీ మారడం కష్టమేమో అనిపించేది. కానీ ద్రవిడ్ సార్ ఇచ్చిన సలహా విన్నాక నా ఆలోచన మారిపోయింది. నేను ఏ ఫార్మాట్ లో ఆడుతున్నా నా సహజ బ్యాటింగ్, బలాలు అలాగే ఉంటాయని ద్రవిడ్ చెప్పారు. కాబట్టి వైవిధ్యమైన షాట్లు ఆడేందుకు వెనకాడొద్దని నిర్ణయించుకున్నా' అని నయా వాల్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ పద్నాలుగో సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున పుజారా బరిలోకి దిగనున్నాడు.

Tagged ipl 2021, Test Cricket, T20, Rahul Dravid

More News