ముంబైపై కోల్‌కతా గ్రాండ్ విక్టరీ

V6 Velugu Posted on Sep 24, 2021

ఐపీఎల్ సెకండ్ ఫేజ్ ..ముంబై ఇండియన్స్  కు కలిసి రావడం లేదు. హార్డ్ హిట్టర్లు అందుబాటులో ఉన్నా భారీ స్కోర్లు చేయలేక  వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. అదే సమయంలో కుర్రాళ్లతో కోల్ కతా నైట్ రైడర్స్ ఎవరూ ఊహించని స్థాయిలో దూసుకుపోతుంది.  ఆల్ రౌండ్ షోతో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబైపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 155 పరుగుల ఛేజింగ్ లో యంగ్ స్టర్స్ రాహుల్ త్రిపాఠి 74, వెంకటేశ్ అయ్యర్  53 పరుగులతో మెరుపులు మెరిపించడంతో 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులతో విజయం సాధించింది.  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది. డికాక్, 55,రోహిత్ 30తో రాణించగా మిగతా వారు పెద్దగా ఆడలేదు. పాయింట్ల పట్టికలో కోల్ కతా నాలుగో స్థానానికి చేరుకోగా..ముంబై రెండో ఓటమితో ఆరో స్థానానికి పడిపోయింది.

Tagged ipl 2021, mi, Rahul Tripathi, Venkatesh Iyer power, KKR , 7 wickets win

Latest Videos

Subscribe Now

More News