సమ్మర్ ధమాకా.. నేటి నుంచే ఐపీఎల్-14

సమ్మర్ ధమాకా.. నేటి నుంచే ఐపీఎల్-14

ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్..

ఆరు సిటీల్లో.. ఖాళీ స్టేడియాల్లో పోటాపోటీ

నేడు చెన్నైలో ముంబై -బెంగళూరు మధ్య తొలి ఫైట్

రాత్రి 7.30కి మ్యాచ్‌ షురూ

ధనాధన్ క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ వచ్చేసింది. క్రికెట్ ఫ్యాన్స్కు వేసవి వినోదం అందించేందుకు ముస్తాబైంది. ఎనిమిది జట్లు తమ అస్త్రశస్త్రాలతో పోటీకి సిద్ధమయ్యాయి..!  డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్ బెంగళూరు మధ్య నేడు చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే మ్యాచ్తో ఐపీఎల్14వ సీజన్ షురూ కానుంది. నేటి నుంచి 52 రోజుల పాటు క్రికెట్ ఫ్యాన్స్ సూపర్ యాక్షన్ను ఎంజాయ్ చెయ్యనున్నారు. మెగా లీగ్ సొంతగడ్డపై జరుగుతున్నప్పటికీ.. కరోనా ప్రొటోకాల్స్ నేపథ్యంలో  గతేడాది మాదిరిగా ఈ సారి కూడా ఫ్యాన్స్కు స్టేడియంలోకి ఎంట్రీ లేదు. 

ఇండియన్ సమ్మర్లో  క్రికెట్ ఫ్యాన్స్కు కిక్ ఇచ్చే అల్టిమేట్ ఫైట్ ఐపీఎల్ మళ్లీ వచ్చేసింది

ఐదు నెలల కింద అరబ్ గడ్డపై అదరగొట్టిన క్రికెటర్లు ఈసారి ఇండియా గ్రౌండ్స్లో చెలరేగేందుకు రెడీ అయ్యారు

కరోనా పంజా విరుసుతున్న వేళ మరోసారి బయో బబుల్లో.. ఖాళీ స్టేడియాల్లో ఖతర్నాక్ ఆటతో అభిమానులను అలరించబోతున్నారు.

మండు వేసవిలో  టవరింగ్ సిక్సర్లు, రివ్వున దూసుకొచ్చే బౌన్సర్లు, మెరుపు ఫీల్డింగ్..
రసవత్తర పోరాటాలతో ఆనందాన్ని పంచేందుకు అస్త్రాలు రెడీ చేసుకున్నారు.. 

మెగా లీగ్ 14వ సీజన్ నేడే ఆరంభం..!

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ,  కింగ్ విరాట్ కోహ్లీ మధ్య జరిగే ఫస్ట్ ఫైట్‌తో 52 రోజుల మెగా ఈవెంట్‌కు తెరలేస్తోంది

వచ్చే ఏడాది నుంచి రెండు కొత్త జట్ల చేరికతో టీమ్స్ సంఖ్య, ఫార్మాట్ మారుతుంది..

దాంతో,  ఎనిమిది జట్లు చివరిసారి పోటీ పడనుండడం ఇంకాస్త ఆసక్తి పెంచుతోంది
అంతా బాగానే ఉన్నా.. దేశంలో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్  ఐపీఎల్‌ను నీడలా వెంటాడుతోంది

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. బయో బుబల్లోకి వచ్చి క్రికెటర్లు, ఫ్రాంచైజీలను కంగారు పెడుతోంది..

అయినా లీగ్‌ను సక్సెస్ చేసి ఈ ఇయర్ ఎండ్లో టీ20 వరల్డ్ కప్ హోస్టింగ్‌కు కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని బీసీసీఐ భావిస్తోంది

అందుకే లీగ్‌ను ఖాళీ స్టేడియాలకు పరిమితం చేసింది..

మనం కూడా గడప దాటకుండా.. 
ఈ ‘సమ్మర్ ధమాకా’ను  స్ర్కీన్పై చూసి ఆస్వాదిద్దాం..!

చెన్నై: కరోనా కారణంగా  లాస్ట్ సీజన్ అరబ్ గడ్డకు తరలివెళ్లి..  మన వింటర్లో హంగామా చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుట్టింటికి తిరిగొచ్చింది. మహమ్మారి వైరస్ భయం తగ్గకపోయినా..  ఎప్పట్లానే ఇండియన్ సమ్మర్లో ధనాధన్ ఆటతో ఫ్యాన్స్కు వినోదాన్ని పంచేందుకు సరికొత్తగా ముస్తాబైంది.  మెగా లీగ్ పద్నాలుగో ఎడిషన్కు శుక్రవారం చెన్నై చెపాక్ స్టేడియంలో తెరలేవనుంది. మునుపటి సీజన్ ఫైనలిస్టుల మధ్య ఫస్ట్ ఫైట్ ఉండాలన్న గత సంప్రదాయానికి భిన్నంగా  ఈ సారి డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీ పడనుంది. న్యూట్రల్ వెన్యూల కారణంగా ఈ మార్పు అనివార్యం అయింది. రెండు టీమ్స్లోనూ సూపర్ స్టార్లు బిగ్ హిట్లర్లు ఉండడంతో  కొత్త సీజన్కు సరికొత్త ఆరంభం లభిస్తుందని ఆర్గనైజర్స్ భావిస్తున్నారు.  కరోనా తర్వాత  క్రికెటర్లకు అలవాటైన బయో బబుల్లో  ఎనిమిది జట్ల కోసం ఆరు ఖాళీ స్టేడియాల్లో 52 రోజుల అల్టిమేట్ ఫైట్ను షెడ్యూల్ చేశారు.  ఈ ఏడాది చివర్లో ఇండియాలోనే టీ20 వరల్డ్కప్ ఉన్న నేపథ్యంలో ఆ టోర్నీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ను రెడీ చేసుకునేందుకు ఈ సీజన్ను యూజ్ చేసుకోవాలని విరాట్ కోహ్లీ ఆశిస్తున్నాడు. అదే టైమ్లో  టీ20 వరల్డ్కప్ హోస్టింగ్కు బీసీసీఐకి ఈ టోర్నీ డ్రెస్ రిహార్సల్ కానుంది. 
అటు సూపర్ స్టార్స్.. ఇటు యంగ్ స్టర్స్ 
ఐపీఎల్ అంటేనే  స్టార్ ప్లేయర్ల హంగామా. అదే టైమ్లో యంగ్స్టర్స్ తమ పెర్ఫామెన్స్తో  ఓవర్నైట్ స్టార్లుగా మారుతుంటారు. ఈ సీజన్లోనూ మేటి ఆటగాళ్లు, కుర్రాళ్లు సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారు. ఫ్రాంచైజీలు సైతం సరికొత్త ప్లాన్స్తో బరిలోకి దిగుతున్నాయి. ఐదు టైటిల్స్తో  మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్పై ఎప్పట్లాగే ఈ సారీ భారీ అంచనాలున్నాయి. డిఫెండింగ్ చాంప్గా బరిలోకి దిగుతున్న ముంబై.. లీగ్లో ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అందుకు ఇండియన్స్కు అన్ని అర్హతలూ ఉన్నాయి. నేషనల్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ టీమ్ కంపోజిషన్ ముంబై స్థాయిలో లేదు. ఇండియా కెప్టెన్గా ఎంతో సక్సెస్ సాధించిన విరాట్ కెరీర్లో ఐపీఎల్ టైటిల్ వెలితిగా ఉంది.  ఆసీస్ చిచ్చరపిడుగు గ్లెన్ మ్యాక్స్వెల్, న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్ రాకతో అయినా ఆ టీమ్ రాత మారుతుందని ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక, లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ సీజన్ సవాలే. పదమూడో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా నిరాశ పరిచింది. అయితే, సురేశ్ రైనా తిరిగి రావడంతో మళ్లీ  బలంగా మారింది. తాను నమ్ముకున్న రాయుడు, తాహిర్, డుప్లెసిస్, సామ్ కరన్తో సీఎస్కేకు నాలుగో కప్పు అందించి కెప్టెన్గా తన మార్కు మళ్లీ చూపాలని ధోనీ పట్టుదలగా ఉన్నాడు. ఇక, లో ప్రొఫైల్ టీమ్స్లో ఒకటైన సన్రైజర్స్ హైదరాబాద్.. ఫీల్డ్లో తన తడాఖా చూపెట్టడంలో దిట్ట. ఫారిన్ స్టార్లే ఆ టీమ్ బలం. కెప్టెన్ డేవిడ్ వార్నర్, వరల్డ్ బెస్ట్ టీ20 బౌలర్ రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్, జేసన్ హోల్డర్, జానీ బెయిర్స్టో, జేసన్ రాయ్తో పాటు ఇండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్తో రైజర్స్ కూడా టైటిల్ రేసులో ఉంది. ఇక, రెండు సార్లు చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి ఆండ్రీ రసెల్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటోంది. . వైట్ బాల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న ఇయాన్ మోర్గాన్... సెటిల్డ్ బ్యాటింగ్ ఆర్డర్తో ముందుకెళ్లాలని చూస్తున్నాడు. మరోవైపు పేరు మార్చుకున్న పంజాబ్ కింగ్స్ ఈసారి ఎలాగైనా  ఐపీఎల్ కింగ్ అవ్వాలని కోరుకుంటోంది. లాస్ట్ సీజన్లో కెప్టెన్ లోకేశ్ రాహుల్ పెర్ఫామెన్స్పైనే ఎక్కువగా డిపెండ్ అయి బోల్తా కొట్టిన పంజాబ్ ఈసారి స్టార్టింగ్ నుంచే సమష్టిగా రాణించాల్సి ఉంది. మహ్మద్ షమీతో పాటు క్రిస్ గేల్ చెలరేగితే పంజాబ్ రాత మారే చాన్స్ ఉంది.
కొత్త కెప్టెన్లు ఏం చేస్తారో..
ఈ సీజన్ తో ఇద్దరు యంగ్ స్టర్స్ రిషబ్ పంత్, సంజూ శాంసన్ కెప్టెన్లుగా ప్రమోషన్ కొట్టేశారు. ఐపీఎల్తోనే వెలుగులోకి వచ్చి.. ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకున్న రిషబ్ లాస్ట్ సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ను నడిపిస్తున్నాడు. షోల్డర్ ఇంజ్యురీతో శ్రేయస్ అయ్యర్ సీజన్ నుంచి వైదొలగడంతో పంత్పై కెప్టెన్సీ భారం పడింది. ఆస్ట్రేలియా టూర్లో గబ్బా టెస్టులో ఇండియాను గెలిపించి తనలోని కొత్త వెర్షన్ను పరిచయం చేసిన రిషబ్ ఇండియన్ క్రికెట్లో ఇప్పడు మోస్ట్ కాన్ఫిడెంట్ క్రికెటర్గా కనిపిస్తున్నాడు. పృథ్వీ షా, మార్కస్ స్టోయినిస్, షిమ్రన్ హెట్మయర్, స్టీవ్ స్మిత్, రహానెలతో కూడిన బలమైన బ్యాటింగ్.. కగిసో రబాడ, అన్రిచ్ నోకియా,  అశ్విన్, అమిత్ మిశ్రా, అక్షర్లతో అద్భుతమైన బౌలింగ్ లైనప్ ఉన్న ఢిల్లీని పంత్ ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీమిండియాలోకి వస్తూ పోతూ ఉన్న  సంజూ శాంసన్ ఈ సారి రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్సీ అందుకున్నాడు. టాలెంట్ ఉన్నప్పటికీ నిలకడ లేని శాంసన్కు బెన్స్టోక్స్, జోస్ బట్లర్, క్రిస్ మోరిస్ వంటి ఫారిన్ స్టార్లు సపోర్ట్గా ఉన్నారు. అయితే, ఆరంభ మ్యాచ్లకు జోఫ్రా ఆర్చర్ దూరం కావడం మైనస్. ఫస్ట్ ఎడిషన్లో టైటిల్ నెగ్గిన తర్వాత సీజన్ సీజన్కు దిగజారిపోతున్న రాయల్స్ రాతను శాంసన్ మారుస్తాడో లేదో చూడాలి. 
కారవాన్ షెడ్యూల్.. పోటాపోటీ మ్యాచ్‌లు
ఐదు నెలల వ్యవధిలోనే రెండోసారి జరుగుతున్నప్పటికీ ఈ సీజన్ క్రికెటర్లు, ఫ్యాన్స్కు సరికొత్త అనుభూతి పంచనుంది. లీగ్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ కారవాన్ షెడ్యూల్లో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఈ మోడల్లో ప్రతీ టీమ్ ఒక వేదికపై కొన్ని మ్యాచ్లు ఆడి మరో వేదికకు వెళ్తుంది.  తొలి దశలో చెన్నై, ముంబైలో పోటీలు ఉంటాయి. ఆ తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీలో.. మూడో అంచెలో బెంగళూరు, కోల్కతాలో మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. అహ్మదాబాద్ ప్లేఆఫ్స్, ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వనుంది.  వేదికలను తగ్గించడంతో అన్ని జట్లూ న్యూట్రల్ వెన్యూస్లో ఆడేలా షెడ్యూల్ చేశారు. దీనివల్ల  ఏ టీమ్కు కూడా హోమ్గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉండదు. అయితే,  సేమ్ వెన్యూలో వరుసగా మ్యాచ్లు ఉంటాయి కాబట్టి.. జట్లు మరింత బెటర్గా ప్రిపేర్ అయ్యేందుకు, కండీషన్స్ను యూజ్ చేసుకొని సత్తా చాటేందుకు వీలుంటుంది.  దీని వల్ల మ్యాచ్లు మరింత పోటాపోటీగా సాగే అవకాశం ఉంది. ఓవరాల్గా రెండు ప్రధాన వేదికల్లో ప్రతీ జట్టు తొమ్మిది మ్యాచ్లు, మరో రెండు వెన్యూస్‌లో ఇంకో ఐదు మ్యాచ్లు ఆడతాయి.
   
06: ఐపీఎల్లో క్రిస్ గేల్ చేసిన సెంచరీల సంఖ్య.  టోర్నీలో ఇదే రికార్డు. కోహ్లీ(5), వార్నర్(4), వాట్సన్(4), డివిలియర్స్(3) తర్వాతి ప్లేస్ లో ఉన్నారు.

 48:డేవిడ్ వార్నర్ ఈ లీగ్ లో అందరికంటే ఎక్కువగా చేసిన హాఫ్ సెంచరీలు.ధవన్(41), రోహిత్(39), కోహ్లీ(39), రైనా(38) టాప్–5లో ఉన్నారు. 

170: లీగ్లో అత్యధిక వికెట్లు. శ్రీలంక వెటరన్  లసిత్ మలింగ సాధించాడు.  అమిత్ మిశ్రా(160), పీయూష్ చావ్లా(156)  టాప్-–3లో ఉన్నారు. 

6/12: ఓ మ్యాచ్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. 2019లో సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై పేసర్ అల్జారీ జోసెఫ్ ఈ ఫీట్ చేశాడు.
349: క్రిస్ గేల్ కొట్టిన సిక్సర్ల సంఖ్య. లీగ్లో  హయ్యెస్ట్. ఏబీ డివిలియర్స్(235) సెకండ్ ప్లేస్లో నిలిచాడు.

175: ఐపీఎల్లో ఓ మ్యాచ్లో హయ్యెస్ట్ ఇండివిజ్యువల్ స్కోరు. 2013లో పుణె వారియర్స్పై ఆర్సీబీ తరఫున క్రిస్ గేల్ 66 బాల్స్లో సాధించాడు. 

5878: ఐపీఎల్లో విరాట్ కోహ్లీ చేసిన రన్స్. టోర్నీల్లో హయ్యెస్ట్. రైనా (5368) సెకండ్ ప్లేస్లో ఉన్నాడు.