రాంచీ: చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఎక్కడికి వెళ్లినా.. ఎవరినో ఒకరిని పలుకరించి తన ప్రత్యేకత చాటుకుంటాడు. తాజాగా రాంచీ ఎయిర్‌పోర్ట్‌లో తన కోసం ఎదురు చూసిన దివ్యాంగ అభిమానిని కలిసి ఆశ్చర్యపరిచాడు. సీఎస్‌కే టీమ్‌ను ఇష్టపడే ఆమెతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడాడు. తనను కలవడానికి విలువైన సమయాన్ని వెచ్చించినందుకు సదరు ఫ్యాన్.. ధోనీకి ధన్యవాదాలు తెలియజేసింది. మహీపై తనకు ఉన్న అభిమానాన్ని చాటే విధంగా ఆమె ఓ చిత్ర పటాన్ని వేసింది. దానిని చూసి సంతోషించిన ధోనీ.. ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియో, ఫొటోలు వైరల్‌గా మారాయి.

