చెన్నైపై హైదరాబాద్ గ్రేట్ విక్టరీ

చెన్నైపై హైదరాబాద్ గ్రేట్ విక్టరీ

ఐపీఎల్-15వ సీజన్ లో బోణీ కొట్టింది SRH. వరుసగా 2 ఓటమిల తర్వాత గ్రేట్ విక్టరీ సాధించింది. ఫేవరేట్ చెన్నైపై గెలిచి సత్తాచాటింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 రన్స్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కేన్ మామ జట్టు అద్భుతంగా రాణించింది. ఆచి తూచి ఆడుతూ.. విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ() హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో 3 వికెట్లు కోల్పోయిన SRH మరో ఓవర్ ఉండగానే 155 రన్స్ చేసి ఫస్ట్ విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజస్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హైదరాబాద్ చెన్నైపైనే విక్టరీ కొట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే చెన్నై , ముంబై గెలుపు ఖాతాలే తెరవలేదనే విషయం తెలిసిందే. హైదరాబాద్ తో తర్వాతి మ్యాచ్ 11న GTతో జరగనుంది.

 


చెన్నై బౌలర్లలో.. ముఖేష్ చౌదరి(1) వికెట్లు తీశారు.