
లక్నో: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) సోమవారం తమ టీమ్ లోగోను రివీల్ చేసింది. గరుడ పక్షి ఆకారంలో, దేశ త్రివర్ణ పతాకం రంగులోని ఈ లోగో ఆకట్టుకుంటోంది. మన ప్రాచీన పురాణాల ప్రేరణతో ఈ లోగోను డిజైన్ చేసినట్టు ఫ్రాంచైజీ తెలిపింది. ‘ఈ లోగోలో గరుడ పక్షి రెక్కల్లోని మూడు రంగులు.. లక్నో సూపర్ జెయింట్స్ దేశం మొత్తానికి చెందుతుంది అని చెబుతుంది. మధ్యలో బ్లూ కలర్ బ్యాట్ క్రికెట్‌ను సూచిస్తుంది. అలాగే, బ్యాట్‌పై రెడ్ బాల్‌కు ఆరెంజ్ సీమ్ కూడా ఉంది. అది జయ తిలకం లాంటిది’ అని ఫ్రాంచైజీ వివరించింది. ప్లేయర్ ఆక్షన్‌కు ముందు లక్నో కేఎల్ రాహుల్ (రూ. 17 కోట్లు), మార్కస్ స్టోయినిస్ (9.2 కోట్లు), రవి బిష్నోయ్ (4 కోట్లు)ను టీమ్‌లోకి తీసుకుంది.