IPL 2022: ప్లేయర్లపై క్లారిటీ

IPL 2022: ప్లేయర్లపై క్లారిటీ

ముంబై: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ 2022 సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. ఎనిమిది పాత టీమ్స్‌‌‌‌‌‌‌‌లో  కొనసాగే ప్లేయర్లెవరో క్లారిటీ వచ్చింది. ప్లేయర్‌‌‌‌‌‌‌‌ రిటెన్షన్ పాలసీ లిస్ట్‌‌‌‌‌‌‌‌ మంగళవారం రాత్రి రిలీజ్‌‌‌‌‌‌‌‌ అయింది. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ లెజెండ్స్‌‌‌‌‌‌‌‌ మహేంద్ర సింగ్‌‌‌‌‌‌‌‌ ధోనీ, విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ, రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మను వారి ఫ్రాంచైజీలు రిటైన్‌‌‌‌‌‌‌‌ చేసుకోగా.. కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌, హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా, వార్నర్‌‌‌‌‌‌‌‌ వంటి స్టార్లతో పాటు కీలక ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేశాయి. ఈ క్రమంలో కొన్ని ఫ్రాంచైజీలు ఆక్షన్‌‌‌‌‌‌‌‌కు ముందే కొంతమందిపై కోట్ల వర్షం కురిపించాయి.  టీమ్‌‌‌‌కు నలుగురికి చొప్పున 32 మందికి అవకాశం ఉన్నప్పటికీ ఎనిమిది టీమ్స్‌‌‌‌ కలిపి మొత్తంగా 27 మంది ప్లేయర్లను రిటైన్‌‌‌‌ చేసుకున్నాయి.

సిరాజ్​ ఆర్​సీబీతోనే,  చహల్​, హర్షల్​కు నో

విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌, హైదరాబాదీ సిరాజ్‌‌‌‌‌‌‌‌ను రిటైన్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ.. లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఎడిషన్‌‌‌‌‌‌‌‌ లీడింగ్ వికెట్‌‌‌‌‌‌‌‌ టేకర్‌‌‌‌‌‌‌‌ హర్షల్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌తో పాటు స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ యుజ్వేంద్ర చహల్‌‌‌‌‌‌‌‌ను వదులుకుంది. కాగా, 2018 సీజన్‌‌‌‌‌‌‌‌లో కోహ్లీని రిటైన్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నప్పుడు రూ.17 కోట్లు ఇచ్చిన ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ ఈసారి ముగ్గురినే రిటైన్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడంతో కోహ్లీ రేటు 15 కోట్లకు తగ్గింది. మరోవైపు మోస్ట్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రాను రిటైన్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న ముంబై.. సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌, కీరన్‌‌‌‌‌‌‌‌ పొలార్డ్‌‌‌‌‌‌‌‌లను 3,4వ ప్లేయర్లుగా టీమ్‌‌‌‌‌‌‌‌తో కొనసాగించాలని డిసైడైంది. తమ కోర్​ టీమ్​లోని హార్దిక్‌‌‌‌‌‌‌‌, ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్​ చేసింది.

కెప్టెన్లను వదులకున్నరు

పంజాబ్‌‌‌‌‌‌‌‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌ తమ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ లోకేశ్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ను వదులుకోగా.. లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో టీమ్‌‌‌‌‌‌‌‌ను ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేర్చిన తమ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ఇయాన్‌‌‌‌‌‌‌‌ మోర్గాన్‌‌‌‌‌‌‌‌ను కోల్​కతా నైట్​ రైజర్స్​ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసింది. పంజాబ్‌‌‌‌‌‌‌‌ తమ ఓపెనర్‌‌‌‌‌‌‌‌ మయాంక్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌తో పాటు అన్‌‌‌‌‌‌‌‌క్యాప్డ్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ అర్షదీప్‌‌‌‌‌‌‌‌ను రిటైన్‌‌‌‌‌‌‌‌ చేసుకుంది. కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌.. కొత్త ఫ్రాంచైజీ లక్నోకు కెప్టెన్‌‌‌‌‌‌‌‌ అయ్యే అవకాశాలున్నాయి.  ఇక, కోల్‌‌‌‌‌‌‌‌కతా ఇద్దరు విండీస్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు రసెల్‌‌‌‌‌‌‌‌, నరైన్‌‌‌‌‌‌‌‌తోపాటు  మిస్టరీ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ వరుణ్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి,  లాస్ట్‌‌‌‌‌‌‌‌ సీజన్‌‌‌‌‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌‌‌‌‌ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ను తమతోనే ఉంచుకుంది. అయితే, రసెల్‌‌‌‌‌‌‌‌కు 12 కోట్లు, చక్రవర్తి, వెంకటేశ్‌‌‌‌‌‌‌‌కు చెరో 8 కోట్లు కేటాయించిన కేకేఆర్‌‌‌‌‌‌‌‌ నరైన్‌‌‌‌‌‌‌‌తో ఆరు కోట్లకే డీల్‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకుంది. గిల్​, రాణాను వదిలేసింది.

సమద్‌‌‌‌‌‌‌‌, ఉమ్రాన్​కు జాక్‌‌‌‌‌‌‌‌పాట్‌‌‌‌‌‌‌‌

జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌కు చెందిన సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు అబ్దుల్‌‌‌‌‌‌‌‌ సమద్‌‌‌‌‌‌‌‌, ఉమ్రాన్‌‌‌‌‌‌‌‌ మాలిక్‌‌‌‌‌‌‌‌కు జాక్‌‌‌‌‌‌‌‌పాట్‌‌‌‌‌‌‌‌ తగిలింది. వార్నర్‌‌‌‌‌‌‌‌, రషీద్‌‌‌‌‌‌‌‌, బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో, భువనేవ్వర్​ వంటి స్టార్లను కాదనుకున్న సన్​రైజర్స్‌‌‌‌‌‌‌‌ అనూహ్యంగా ఈ ఇద్దరినీ రిటైన్‌‌‌‌‌‌‌‌ చేసుకుంది. అన్‌‌‌‌‌‌‌‌క్యాప్డ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ల కేటగిరీ కింద వీళ్లు చెరో 4 కోట్లు అందుకుంటారు. 2020లో  ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ సమద్‌‌‌‌‌‌‌‌ను  రూ. 20 లక్షలకు కొన్న రైజర్స్‌‌‌‌‌‌‌‌ లాస్ట్ ఎడిషన్‌‌‌‌‌‌‌‌ యూఏఈ లెగ్‌‌‌‌‌‌‌‌లో గాయపడ్డ టి. నటరాజన్‌‌‌‌‌‌‌‌కు రీప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌గా ఉమ్రాన్‌‌‌‌‌‌‌‌ మాలిక్‌‌‌‌‌‌‌‌ను తీసుకొని 10 లక్షలు ఇచ్చింది.

 తక్కువ ఇచ్చినా.. లిస్ట్​ ప్రకారమే కోత

ఈ సీజన్‌‌ రిటెన్షన్‌‌ పాలసీ ప్రకారం ఓ టీమ్‌‌ నలుగురిని రిటైన్‌‌ చేసుకుంటే ఆర్డర్‌‌ ప్రకారం వాళ్లకు వరుసగా  16, 12, 8, 6 కోట్లు కేటాయించాలి.  ముగ్గురికి15, 11, 7 కోట్లు, ఇద్దరికి 14, 10 కోట్లు.. ఒక్కరినే రిటైన్‌‌ చేసుకుంటే 14 కోట్లు కేటాయించాలి. అన్‌‌క్యాప్డ్‌‌ ప్లేయర్‌‌కు రూ. 4 కోట్లు ఇవ్వాలి. ఎంతమందిని రిటైన్​ చేసుకుంటే ఆ మొత్తాన్ని టీమ్​ ఆక్షన్​ పర్స్​ (రూ. 90 కోట్లు) నుంచి తగ్గిస్తారు.  అయితే, తమ డీలింగ్స్‌‌‌‌లో భాగంగా కొన్ని ఫ్రాంచైజీలు కొందరు ప్లేయర్లకు తక్కువ డబ్బు ఇచ్చినప్పటికీ.. ప్లేయర్​ రిటెన్షన్‌‌‌‌ పాలసీలో నిర్దేశించిన లిస్ట్​ ప్రకారమే ఆక్షన్‌‌‌‌ పర్స్‌‌‌‌లో కోత పెట్టారు. కాగా,  పాత టీమ్స్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసిన ప్లేయర్ల లిస్ట్‌‌‌‌ నుంచి కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్‌‌‌‌, లక్నో చెరో ముగ్గురు ప్లేయర్లను ఎంచుకోవచ్చు. అందుకు రెండు టీమ్స్​కు  ఈ నెల 25వ వరకు అవకాశం ఇచ్చారు. మెగా ఆక్షన్‌‌‌‌ జనవరి ఫస్ట్‌‌‌‌ వీక్‌‌‌‌లో జరిగే చాన్స్​ ఉంది.

ధోనీకి 12 కోట్లు..  జడేజాకు 16 కోట్లు

డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంప్‌‌‌‌‌‌‌‌ సీఎస్‌‌‌‌‌‌‌‌కే ధోనీ, జడేజాతోపాటు రుతురాజ్‌‌‌‌‌‌‌‌, మొయిన్‌‌‌‌‌‌‌‌ అలీని కొనసాగించాలని డిసైడైంది. అయితే, జడేజాకు ధోనీకంటే ఎక్కువ రేటు ఇచ్చి సర్​ప్రైజ్​ చేసింది. ఫస్ట్​ ప్లేయర్​గా జడ్డూకు 16 కోట్లు ముట్టజెప్పింది. 2018లో 15 కోట్లతో ధోనీని రిటైన్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న సీtఎస్‌‌‌‌‌‌‌‌కే  ఈసారి తనకు 12 కోట్లు కేటాయించింది. రెండేళ్ల కిందట 20 లక్షలకు తీసుకున్న రుతురాజ్‌‌‌‌‌‌‌‌కు ఆరు కోట్లు ఇచ్చింది.  ఇక, ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ తమ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌తో పాటు అక్షర్‌‌‌‌‌‌‌‌, పృథ్వీ, అన్రిచ్‌‌‌‌‌‌‌‌ నోర్జ్‌‌‌‌‌‌‌‌లను రిటైన్‌‌‌‌‌‌‌‌ చేసుకొని రబాడ, అశ్విన్‌‌‌‌‌‌‌‌తో పాటు యంగ్‌‌‌‌‌‌‌‌ పేసర్ అవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసింది. స్టోక్స్‌‌‌‌‌‌‌‌, ఆర్చర్‌‌‌‌‌‌‌‌ను వదులుకున్న  రాజస్తాన్‌‌‌‌‌‌‌‌  తమ కెప్టెన్ శాంసన్‌‌‌‌‌‌‌‌తో పాటు బట్లర్‌‌‌‌‌‌‌‌, యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ను రిటైన్‌‌‌‌‌‌‌‌ చేసుకుంది.

ఏ టీమ్‌‌‌‌‌‌‌‌లో ఎవరున్నారు..

  • సీఎస్‌‌‌‌‌‌‌‌కే: జడేజా (16 కోట్లు), ధోనీ (12 కోట్లు), మొయిన్‌‌‌‌‌‌‌‌ అలీ (8 కోట్లు), రుతురాజ్‌‌‌‌‌‌‌‌ (6 కోట్లు) ; ఆక్షన్‌‌‌‌‌‌‌‌కు మిగిలిన పర్స్‌‌‌‌‌‌‌‌: 48 కోట్లు
  • ముంబై: రోహిత్‌‌‌‌‌‌‌‌ (16 కోట్లు), బుమ్రా (12 కోట్లు), సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ (8 కోట్లు), పొలార్డ్‌‌‌‌‌‌‌‌ (6 కోట్లు);  మిగిలిన పర్స్‌‌‌‌‌‌‌‌: 48 కోట్లు
  • ఢిల్లీ: పంత్‌‌‌‌‌‌‌‌(16 కోట్లు), అక్షర్‌‌‌‌‌‌‌‌ (9 కోట్లు, పర్స్‌‌‌‌‌‌‌‌లో 12 కోట్లు కట్‌‌‌‌‌‌‌‌ చేస్తారు), పృథ్వీ షా (7.5 కోట్లు; పర్స్‌‌‌‌‌‌‌‌లో 8  కోట్లు కట్‌‌‌‌‌‌‌‌ చేస్తారు), అన్రిచ్‌‌‌‌‌‌‌‌ నోర్జ్‌‌‌‌‌‌‌‌ (6.5 కోట్లు); మిగిలిన పర్స్‌‌‌‌‌‌‌‌: 47.5 కోట్లు
  • కేకేఆర్‌‌‌‌‌‌‌‌:  రసెల్‌‌‌‌‌‌‌‌ (12 కోట్లు.. పర్స్‌‌‌‌‌‌‌‌లో 16 కోట్లు కట్‌‌‌‌‌‌‌‌ చేస్తారు), చక్రవర్తి (8 కోట్లు; పర్స్‌‌‌‌‌‌‌‌లో 12 కోట్లు కట్‌‌‌‌‌‌‌‌ చేస్తారు), వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ (8 కోట్లు), నరైన్‌‌‌‌‌‌‌‌ (6 కోట్లు); మిగిలిన పర్స్‌‌‌‌‌‌‌‌: 48 కోట్లు
  • ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ: కోహ్లీ (15 కోట్లు), మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ (11 కోట్లు), మహ్మద్​ సిరాజ్‌‌‌‌‌‌‌‌ (7 కోట్లు); మిగిలిన పర్స్‌‌‌‌‌‌‌‌: 57 కోట్లు
  • రాజస్తాన్‌‌‌‌‌‌‌‌: సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌ (14 కోట్లు), బట్లర్‌‌‌‌‌‌‌‌ (10 కోట్లు ), యశస్వి (4 కోట్లు, అన్‌‌‌‌‌‌‌‌క్యాప్డ్‌‌‌‌‌‌‌‌ ); మిగిలిన పర్స్‌‌‌‌‌‌‌‌: 62 కోట్లు
  • సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌: విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ (14 కోట్లు), సమద్‌‌‌‌‌‌‌‌ (4 కోట్లు, అన్‌‌‌‌‌‌‌‌క్యాప్డ్‌‌‌‌‌‌‌‌), ఉమ్రాన్‌‌‌‌‌‌‌‌ మాలిక్‌‌‌‌‌‌‌‌ (4 కోట్లు, అన్‌‌‌‌‌‌‌‌క్యాప్డ్‌‌‌‌‌‌‌‌); మిగిలిన పర్స్‌‌‌‌‌‌‌‌: 68 కోట్లు
  • పంజాబ్‌‌‌‌‌‌‌‌: మయాంక్‌‌‌‌‌‌‌‌ (12 కోట్లు; పర్స్‌‌‌‌‌‌‌‌లో 14 కోట్లు కట్‌‌‌‌‌‌‌‌ చేస్తారు), అర్షదీప్‌‌‌‌‌‌‌‌ (4 కోట్లు, అన్‌‌‌‌‌‌‌‌క్యాప్డ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌); మిగిలిన పర్స్‌‌‌‌‌‌‌‌: 72 కోట్లు.