బీసీసీఐ క్యాంప్‌పై ఐపీఎల్‌ ఫ్రాంచైజీల గుస్సా

బీసీసీఐ క్యాంప్‌పై ఐపీఎల్‌ ఫ్రాంచైజీల గుస్సా


బెంగళూరు: ఐపీఎల్‌‌ కొత్త సీజన్‌‌కు ముందు బెంగళూరులోని ఎన్‌‌సీఏలో టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ ఏర్పాటు చేసిన పది రోజుల ఫిట్‌‌నెస్‌‌ క్యాంప్‌‌పై ఐపీఎల్‌‌ ఫ్రాంచైజీలు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ క్యాంప్‌‌ వల్ల తమకు పలు సమస్యలు ఎదురువుతున్నాయంటూ ఐపీఎల్‌‌ చైర్మన్‌‌ బ్రిజేష్‌‌ పటేల్‌‌కు ఫిర్యాదు చేశాయి. సీజన్​కు ముందు  స్పాన్సర్‌‌తో తమకు కమిట్‌‌మెంట్స్‌‌ ఉంటాయని,  కానీ, వ్యాపార ప్రకటనల వంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కీలక ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారిందని తెలిపాయి. ప్లేయర్లంతా ఒక్క చోట ఉండటంతో వాళ్లు కరోనా వైరస్‌‌ బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుత షెడ్యూల్‌‌ ప్రకారం ఈనెల 15న క్యాంప్‌‌ ముగిస్తే.. తర్వాతి రోజు సదరు ప్లేయర్లు ఆయా ఫ్రాంచైజీల బేస్‌‌కు చేరుకుంటారు. ఐపీఎల్‌‌ బయో బబుల్‌‌లో చేరే ముందు మూడో రోజులు క్వారంటైన్‌‌లో ఉండాలి. ఈ లెక్కన ఇండియా టాప్‌‌ ప్లేయర్లంతా మార్చి 19 లేదా 20నే ఫ్రాంచైజీలకు అందుబాటులోకి వస్తారు. ఆపై ఆరు రోజుల్లోనే మెగా లీగ్‌‌ మొదలవుతుంది కాబట్టి.. స్పాన్సర్స్‌‌తో కుదుర్చుకున్న  ఒప్పందాలను పూర్తి చేయడానికి సమయం సరిపోదని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి.  మరోవైపు టీ20 వరల్డ్‌‌కప్‌‌ను దృష్టిలో ఉంచుకొని  క్యాంప్​లో చేరాలని బోర్డు 25 మందికి చెప్పింది. చాలా మంది ఎన్​సీఏకు రాగా..  హార్దిక్‌‌ పాండ్యా కూడా ఈ క్యాంప్‌‌లో  చేరనున్నాడు.