ఐపీఎల్ 2022 భారత్లోనే

ఐపీఎల్ 2022 భారత్లోనే

ఐపీఎల్ 2022 భారత్ లోనే జరగనుందా? ఇండియానే ఐపీఎల్ 2022కు వేదిక కానుందా ?అంటే అవుననే సమాధానం వస్తోంది. 2022లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL)ఈ సారి ముంబైలో జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీ వర్గాలు ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి తెలిపాయి. ముంబైలో వాంఖడే స్టేడియంలో, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, డిప్యూటీ పాటిల్ స్టేడియం, ముంబై, పూణెలో నిర్వహించడానికి బీసీసీఐ ఆలోచిస్తోంది. అయితే ఎలాంటి పబ్లిక్ లేకుండానే... ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ సిద్ధమవుతుంది. 

మార్చి నెల చివరివారంలో ఐపీఎల్‌ 2022 సీజన్‌ ప్రారంభమౌతుందని బీసీసీఐ ప్రకటించింది. మే నెలలో ఈ సీజన్‌ ముగుస్తుంది. మెజారిటీ టీమ్‌ ఓనర్లు మ్యాచ్‌లు భారత్‌లోనే జరగాలని కోరుకుంటున్నారని బీసీసీఐ కార్యదర్శి జయ్‌ షా వెల్లడించారు. అహ్మదాబాద్‌, లక్నోలతో కలిసి మొత్తం పది టీమ్‌లు ఈసారి ఐపీఎల్‌లో పాల్గొంటాయి. సాధ్యమైనంత వరకు భారత్‌లో మ్యాచ్‌లు జరిపేందుకు కృషి చేస్తామని, ఒకవేళ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోతే ప్లాన్‌ బి అమలు చేస్తామన్నారు. 

IPL ప్లేయర్ రిజిస్ట్రేషన్ జనవరి 20న ముగిసింది. మొత్తం 1,214 మంది ఆటగాళ్లు (896 మంది భారతీయులు మరియు 318 మంది ఓవర్సీస్) 2022 ప్లేయర్ వేలంలో భాగంగా సైన్ అప్ చేసారు. రెండు రోజుల మెగా వేలంలో ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ ప్రతిభావంతుల కోసం 10 జట్లు వేలం వేయనున్నాయి. ఆటగాళ్ల జాబితాలో 270 క్యాప్డ్, 903 అన్‌క్యాప్డ్ మరియు 41 అసోసియేట్ ప్లేయర్‌లు ఉన్నారు. క్యాప్డ్ ఇండియన్ (61 ప్లేయర్స్), క్యాప్డ్ ఇంటర్నేషనల్ (209 ప్లేయర్స్), అసోసియేట్ (41 ప్లేయర్స్), మునుపటి IPL సీజన్‌లలో భాగమైన అన్‌క్యాప్డ్ ఇండియన్స్ (143 ప్లేయర్స్), మునుపటిలో భాగమైన అన్‌క్యాప్డ్ ఇంటర్నేషనల్ IPL సీజన్లు (6 మంది ఆటగాళ్ళు), అన్‌క్యాప్డ్ ఇండియన్స్ (692 మంది ఆటగాళ్లు), మరియు అన్‌క్యాప్డ్ ఇంటర్నేషనల్స్ (62 మంది ఆటగాళ్లు) ఉన్నారు.
ఐపీఎల్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనుంది.