ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం ఎగబడి కొట్టుకున్నారు.. 

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం ఎగబడి కొట్టుకున్నారు.. 

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచును ప్రత్యక్షంగా చూడటానికి ఉత్సాహం చూపిస్తున్న అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. ఒక్కసారిగా వేల సంఖ్యలో జనం పోటెత్తడంతో వారిని కంట్రోల్ చేయడం సెక్యూరిటీ సిబ్బందికి సాధ్యం కాలేదు. కౌంటర్ దగ్గరికి వెళ్లేందుకు అభిమానులు పోటీ పడటంతో ఒకరినొకరు తోసుకుంటూ, కింద పడుతూ నానా అవస్థలు పడ్డారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.   

వాస్తవానికి టికెట్లను పేటీఎం వేదికగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారు. అయినప్పటికీ ఫిజికల్ టికెట్స్ స్టేడియం దగ్గర తీసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు చెప్పడంతో ఈ గందరగోళం నెలకొంది. ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకున్నవారంతా స్టేడియం వద్దకు తరలిరావడంతో.. ఆ పరిసర ప్రాంతాలన్నీ జాతరను తలపించాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్ చేరడం, ధోనీకిదే చివరి టోర్నీఅన్న వార్తలు వస్తుండడంతో.. అతన్ని ప్రత్యక్షంగా చేసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపుతున్నారు.

ఇదిలావుంటే మరో ఫైనల్ బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు నేడు(మే 26) అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచులో గెలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది.

https://twitter.com/mufaddal_vohra/status/1661957984455647234

మరిన్ని వార్తలు