ఐపీఎల్ మినీ వేలం...స్పెషల్ అట్రాక్షన్గా జడేజా

 ఐపీఎల్ మినీ వేలం...స్పెషల్ అట్రాక్షన్గా జడేజా

ఐపీఎల్ 2023 కోసం  మినీ వేలం ప్రక్రియకు రంగం సిద్ధం అయింది. డిసెంబర్ 16న  మినీ వేలం బెంగళూరులో జరగనుందని తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐపీఎల్ 2022 మెగా వేలం కూడా బెంగళూరులోనే జరిగింది. తాజాగా డిసెంబర్‌లో జరిగే  మినీ వేలం ఈవెంట్‌కు కూడా బెంగుళూరే వేదిక కానుంది.

ఏజీఎంలో నిర్ణయం
అక్టోబర్ 18న ముంబైలో బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ మీటింగ్లోనే ఐపీఎల్ మినీ వేలానికి  సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ  ఏజీఎంలో మినీ వేలం తేదీ ఖరారు చేయడంతో పాటు ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను రూ. 90 కోట్ల నుంచి రూ. 95 కోట్లకు పెంచనున్నారని సమాచారం.

జడేజాపై అందరిచూపు..
మినీ వేలంలో టీమిండియా ఆల్ రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ రవీంద్ర జడేజాపై అందరి చూపు ఉండే అవకాశం ఉంది.  గత పదేళ్ల నుంచి చెన్నై తరపున ఆడుతున్న జడేజా..2023 సీజన్ లో మాత్రం..మరో జట్టు తరపున బరిలోకి దిగొచ్చు. 2022 ఐపీఎల్ లో జడేజాను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో అతను హర్ట్ అయ్యాడని సమాచారం. ఇప్పటికే జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి చెన్నై ఫ్రాంచైజీకి సంబంధించిన అన్ని పోస్ట్‌లను తొలగించాడు. ఈ విషయంపై చెన్నై టీమ్ మేనేజ్ మెంట్, ఇతర ఆటగాళ్లు స్పందించలేదు. మినీ వేలానికి ముందే ఫ్రాంచైజీలు రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేయనున్నాయి.