IPL 2024: 8 మందిని వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. రిటైన్ ఆటగాళ్ల లిస్ట్ ఇదే

IPL 2024: 8 మందిని వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. రిటైన్ ఆటగాళ్ల లిస్ట్ ఇదే

ఐపీఎల్‌ 2024 సీజన్‌ వేలానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎడిషన్‌లో కోట్లు కుమ్మరించినా.. రాణించని పలువురు క్రికెటర్లకు ఉద్వాసన పలికింది. వీరిలో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, ఫిట్‌నెస్‌ కారణాలతో బెన్ స్టోక్స్ తనకు తానుగా తప్పుకోగా..  రిటైర్మెంట్ పలికిన అంబటి రాయుడు సహా మరో ఆరుగురు ఉన్నారు.

ఐపీఎల్‌ 17 వ సీజన్‍లోనూ ఎంఎస్ ధోనినే చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును నడిపించనున్నారు.

సీఎస్‌కే రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్ట్: బెన్ స్టోక్స్, డ్వైన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుభ్రాంశు సేనాపతి, ఆకాష్ సింగ్, కైల్ జేమిసన్, ఎస్ మగలా మరియు అంబటి రాయుడు.

సీఎస్‌కే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్: ఎంఎస్ ధోని(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, సిమ్రంజీత్ సింగ్, మతీష పతిరన, ప్రశాంత్ సోలంకి, మిచెల్ సాంట్నర్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివమ్ దూబే, అజింక్య రహానే, నిశాంత్ సింధు, షేక్ రషీద్, అజయ్ మండల్.