IPL 2025: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్‎తో IPL నిలిచిపోతుందా..? బీసీసీఐ అధికారి క్లారిటీ

IPL 2025: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్‎తో IPL నిలిచిపోతుందా..? బీసీసీఐ అధికారి క్లారిటీ

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 2025, మే 7 బుధవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)తో పాటు పాక్‌లోని 9 టెర్రరిస్ట్‌ స్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ మెరుపు దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపింది. ఆపరేషన్ సిందూర్‎తో పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్ భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ఎఫెక్ట్ ఐపీఎల్‎పై పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

ఆపరేషన్ సిందూర్‎తో ఆగ్రహంగా ఉన్న పాక్.. భారత్‎పై ఎటాక్ చేసేందుకు సిద్ధమవుతోన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేలాది మంది అభిమానులు హాజరయ్యే ఐపీఎల్ మ్యాచులను వాయిదా వేయాలని బీసీసీఐ ఆలోచిస్తు్న్నట్లు టాక్. ఐపీఎల్ 2025 సీజన్‌లో మొత్తం 74 మ్యాచులకు గానూ ఇప్పటి వరకు 56 మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. రాబోయే మూడు వారాల్లో ఫైనల్‌తో సహా మరో 14 మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్, పాక్ మధ్య హైటెన్షన్ నేపథ్యంలో మిగిలిన మ్యాచులను రీ షెడ్యూల్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని.. ఇందులో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. బీసీసీఐ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని.. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికైతే షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు బీసీసీఐ కట్టుబడి ఉంటుందని, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. 

►ALSO READ | Ayush Mhatre: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన ఆయుష్ మాత్రే.. సూర్య కెప్టెన్సీలో చెన్నై చిచ్చర పిడుగు

అవసరమైతే కావాల్సిన చర్యలు తీసుకుంటుందన్నారు. దేశ ప్రయోజనాల కోసం ఏదైనా చేయాల్సిన అవసరం ఉంటే.. బీసీసీఐ ప్రభుత్వానికి, దేశానికి సంఘీభావంగా నిలుస్తుందని అన్నారు. దేశ ప్రయోజనాలే మాకు తొలి ప్రాధాన్యమని ఆయన నొక్కి చెప్పారు. కాగా, ఐపీఎల్ ప్రస్తుతం గ్రూప్ స్టేజ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఫ్లే ఆఫ్స్, మే 25న కోల్‌కతాలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బీసీసీఐ అధికారి క్లారిటీతో ఐపీఎల్ పోస్ట్ పోన్ అన్న వార్తలకు చెక్ పడింది. 
 

మరిన్ని వార్తలు