IPL 2026: ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే..

IPL 2026: ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే..

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీ మార్చి 28వ తేదీగా బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు పూర్తి షెడ్యూల్ ని మాత్రం ప్రకటించలేదు. రేపటి ( మార్చి 12న) లోపు ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. అన్ని మ్యాచ్‌ల తేదీలను ఒకేసారి వెల్లడించడం లేదని స్పష్టం చేశారు. కేవలం మొదట 20 రోజుల మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ మాత్రమే రిలీజ్ చేయనున్నారు. అనంతరం మ్యాచ్‌ల తేదీలను టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో ప్రకటించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉండటంతో.. ఎన్నికల ఖచ్చితమైన తేదీలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి షెడ్యూల్ ని బీసీసీఐ ప్రకటించనుంది.

త్వరలో ఆరంభమయ్యే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ గత సీజన్ ఫైనలిస్టుల మధ్య కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్నట్టు ప్రచారం జరుగుతుంది. గత సీజన్‌లో బెంగళూరు ఛాంపియన్‌గా అవతరించింది. ఈసారి కూడా ప్రారంభ మ్యాచ్‌లో ఆ టీమ్ ఉండే అవకాశం ఉంది. కానీ అధికారిక ప్రకటన కోసం క్రికెట్ అభిమానులు ఇంకా కొన్ని రోజలు పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.  అయితే ఐపీఎల్ కి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాధారణ పొందిన క్రికెట్ లీగ్ లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 

ఐపీఎల్ 2026 షెడ్యూల్ పూర్తిగా ప్రకటించకపోయినప్పటికీ, టోర్నమెంట్ ప్రారంభం కోసం క్రికెట్ అభిమానులు ఇప్పటికే ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు మిడిల్ ఈస్ట్ లో యుద్ధంతో గ్యాస్ కొరత వల్లన ఆటగాళ్లు స్టే చేసే హోటల్స్ లో ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉండటంతో పాటు తమిళనాడు, బెంగాల్ ఎన్నికల పరిస్థితుల మధ్య కూడా ఈ సీజన్ మరింత ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ పండితులు.