ఏప్రిల్ 4,5న నిజామాబాద్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్

ఏప్రిల్ 4,5న నిజామాబాద్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్

ముంబై: స్టేడియానికి వెళ్లలేని క్రికెట్ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఐపీఎల్ మజాను అందించేందుకు బీసీసీఐ సిద్ధమైంది.  మార్చి 28న మొదలయ్యే 19వ  సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా దేశవ్యాప్తగా 15 నగరాల్లో ‘ఫ్యాన్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లను ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.  ఈ ఫ్యాన్ పార్కుల్లో భారీ స్క్రీన్లపై మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు అభిమానులకు స్టేడియం అనుభూతిని కలిగించనుంది. 

తెలంగాణ నుంచి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ చాన్స్ లభించింది.  ఏప్రిల్ 4, 5వ తేదీల్లో  నిజామాబాద్ సిటీలోని ఉమెన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ
 గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ ఫ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వేదిక కానుంది. ఈ ఫ్యాన్ పార్కుల్లో కేవలం మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ మాత్రమే కాకుండా.. సంగీతం, వినోదం, ఫుడ్ కోర్టులు, పిల్లల కోసం ప్లే జోన్లు వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉండనున్నాయి.

 2015లో ప్రారంభమైన ఈ ఫ్యాన్ పార్క్ కాన్సెప్ట్ స్టేడియాలకు దూరంగా ఉండే చిన్న పట్టణాల ప్రజలకు ఐపీఎల్ ఉత్సాహాన్ని చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.