IPL : రెచ్చిపోయిన రాహుల్..ముంబై టార్గెట్-198

IPL : రెచ్చిపోయిన రాహుల్..ముంబై టార్గెట్-198

ముంబై : ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 రన్స్ చేసింది. పంజాబ్ కు మంచి ప్రారంభం దక్కింది. ఫస్ట్ రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు గేల్, రాహుల్..ఆ తర్వాత దూకుడు పెంచారు. ఫస్ట్ వికెట్ కు 116 రన్స్ చేశారు. 13వ ఓవర్ లో గేల్ (63 హాఫ్ సెంచరీ) ఔట్ కావడంతో స్కోర్ బోర్డ్ కాస్త తగ్గింది. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు ఎవరూ రాణించనప్పటికీ.. రాహుల్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలోనే సెంచరీ చేసిన రాహుల్ (100) రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ కు గౌరవప్రధమైన స్కోర్ ఇచ్చి, ముంబై ముందు 198 బిగ్ టార్గెట్ ను ఉంచాడు.

ముంబై బౌలర్లలో..హార్ధిక్ పాండ్యా(2),  బెహ్రెన్‌ డార్ప్‌, బుమ్రా చెరో వికెట్ తీశారు.