క్వాలిఫయర్‌-1: దంచికొట్టిన ముంబై.. ఢిల్లీకి బిగ్ టార్గెట్

 క్వాలిఫయర్‌-1: దంచికొట్టిన ముంబై.. ఢిల్లీకి బిగ్ టార్గెట్

దుబాయ్:‌ ఐపీఎల్‌-13 క్వాలిఫయర్‌-1లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన  ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 రన్స్ చేసింది. సూర్య కుమార్ యాదవ్‌(51),  ఇషాన్‌ కిషన్‌(55 నాటౌట్),‌  క్వింటన్‌ డికాక్‌(40), హార్దిక్ పాండ్య(37) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో  5 వికెట్లకు 200 పరుగులు చేసింది.

ఈ నలుగురు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించారు.  ఆఖర్లో ఇషాన్ ‌తో పాటు హార్దిక్‌ పాండ్య మెరుపులు మెరిపించడంతో ముంబై అనూహ్యంగా 200 పరుగుల మార్క్‌ అందుకుంది.  ఓవైపు వికెట్లు పడుతున్నా ముంబై ఏ ఆదశలోనూ జోరు తగ్గించలేదు.

ఢిల్లీ బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక్కడే ముంబైని కట్టడి చేశాడు. కీలక సమయాల్లో స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ను ఔట్‌ చేసి స్కోరు వేగానికి బ్రేక్‌ వేశాడు. ఐతే మిగతా బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. నోర్జ్టే(1/50), డేనియల్‌ శామ్స్‌(0/44) బౌలింగ్ ‌లో ముంబై ప్లేయర్లు చితక్కొట్టారు.