War 2 vs Coolie: 'వార్ 2' పై 'కూలీ' గెలుపు.. రికార్డుల వేట ఆగలేదు!.. రజనీ మేనియాదే పైచేయి!

War 2 vs Coolie: 'వార్ 2' పై 'కూలీ' గెలుపు..   రికార్డుల వేట ఆగలేదు!.. రజనీ మేనియాదే పైచేయి!

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగాల్సిందే. ఆయన తాజా చిత్రం 'కూలీ' (Coolie) విషయంలో కూడా అదే జరిగింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తొలి మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. అయితే, నాలుగో రోజు ఆదివారం కలెక్షన్లు కొంత నెమ్మదించినప్పటికీ, సినిమా రన్ మాత్రం నిలకడగా కొనసాగుతోంది.

అంచనాలకు మించిన 'కూలీ' వసూళ్లు
'కూలీ' తొలి మూడు రోజుల్లో ఇండియాలో రూ158.35 కోట్లు నెట్ వసూలు చేసి, సంచలనం సృష్టించింది. నాలుగో రోజు ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు మరో రూ18.94 కోట్లు సంపాదించి, నాలుగు రోజుల్లో మొత్తం దేశీయ వసూళ్లను రూ178.19 కోట్లకు చేర్చిందని సినీ ట్రెడ్  సక్నిల్క్ తెలిపింది. . ఈ అద్భుతమైన విజయం ఈ చిత్రాన్ని 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలబెట్టింది. అంతేకాకుండా, అంతర్జాతీయంగా కూడా 'కూలీ' తన సత్తా చాటింది. కేవలం మూడు రోజుల్లోనే సుమారు రూ.130 కోట్ల ( $16 మిలియన్లు ) కు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా రూ.500 కోట్లు, ఆ తర్వాత రూ.600 కోట్ల మార్క్‌ను చేరుకోవాలంటే వర్కింగ్ డేస్ లో కూడా నిలకడగా కలెక్షన్లు సాధించడం కీలకం.

'వార్ 2' పై రజనీ మేనియాదే విజయం!
రజనీకాంత్ 'కూలీ'కి అదే రోజు విడుదలైన హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'వార్ 2' (War 2) తో బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీని ఎదుర్కొంది. అయితే, దేశవ్యాప్తంగా 'వార్ 2'కి ఎక్కువ థియేటర్లు లభించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద 'కూలీ'దే పైచేయిగా నిలిచింది. 'కూలీ' ఇప్పటికే రూ.178 కోట్లు దాటి, త్వరలో  రూ.200 కోట్ల మార్క్‌ను చేరుకునే దిశగా దూసుకుపోతోంది. కానీ 'వార్ 2' మాత్రం నాలుగో రోజు సాయంత్రం 5 గంటలకు  రూ. 160 కోట్ల మేర నెట్ వసూళ్లతో వెనుకబడి ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా 'కూలీ' జోరు ముందు 'వార్ 2' తేలిపోయింది. 'కూలీ' $16 మిలియన్లు వసూలు చేయగా, 'వార్ 2' కేవలం $5 మిలియన్లు మాత్రమే రాబట్టగలిగింది. ఇది రజనీకాంత్ స్టామినాను మరోసారి చాటింది.

►ALSO READ | Aryan Khan: షారుఖ్ ఖాన్ స్టైల్‌లో ఆర్యన్ డైరెక్షన్.. 'ది బర్డ్స్ ఆఫ్ బాలీవుడ్' ఫస్ట్ లుక్ రిలీజ్!

 అభిమానుల ఆదరణ
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'కూలీ'లో రజనీకాంత్ టైటిల్ పాత్ర పోషించారు. నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించడం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, రజనీకాంత్ మాస్ ఎలిమెంట్స్, స్టైల్ , లోకేష్ కనగరాజ్ టేకింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ విజయం 'కూలీ'ని కేవలం ఒక సినిమాగా కాకుండా, ఒక సంచలనంగా నిలిపింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ దూకుడు 'వార్ 2' పై 'కూలీ' కొనసాగిస్తుందో లేదో మరి కొన్ని రోజులు వేచిచూడాల్సిందే..