
సమాజంలో నేటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వివక్షకు గురవుతున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.ఉద్యోగులు, విద్యావేత్తలు జాతికి మార్గదర్శకం కావాలన్నారు. జాతి కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాడాలన్నారు. హక్కుల సాధన కోసం అంబేద్కర్ ఓ దారి చూపించారని..ఆ దారిలోనే హక్కుల కోసం పోరాడాలన్నారు.
రవీంద్ర భారతిలో జరిగిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమైక్య జాతీయ సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఉద్యోగస్థులు మంచిగా చదువుకొన్నారు మీరంతా మన జాతికి ఓ మార్గదర్శం కావాలి. మనం అందరం కలిస్తేనే ఓ పెద్ద శక్తి. మన జాతి కోసం, మన సమస్యల పై మనం కలిసి పోరాడాలి. కాకా నిరంతరం పేద వారికోసం పోరాడారు. తక్కువ చేసి, చిన్న చూపు , వివక్షకు గురవుతున్నాం. కాకా అందరికి విద్య అందాలని అంబేద్కర్ విద్యాసంస్థలు స్థాపించారు. ఆరు వేల మంది చదువుతున్నారు.. ఇందులో 75 శాతం ఎస్సీ,ఎస్టీ, బీసీ , మైనారిటీ విద్యార్థులు చదువుతున్నారు అని ఆయన అన్నారు.
►ALSO READ | అరచేతిలో సూర్యుడిని ఆపలేరు: జూ.ఎన్టీఆర్కు మాజీ మంత్రి రోజా మద్దతు