
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన్న వార్-2 సినిమాపై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వార్ 2 సినిమాకు ఎవరూ వెళ్లొద్దంటూ ఎన్టీఆర్‌ను రాయలేని బాషలో బూతులు తిట్టాడు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన కామెంట్లపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా స్పందించారు.
ఈ మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలను, సినిమాలను కలపొద్దని.. పాలిటిక్స్‌లో ఉన్న వారు సినిమాల గురించి.. సినీ రంగంలో ఉన్న వారు రాజకీయాల గురించి మాట్లాడొద్దని హితవు పలికారు. టీడీపీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ సినిమాను ఎవరూ చూడొద్దని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరని.. ఆయన సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో అని.. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారని గుర్తు చేశారు. అరచేతిలో సూర్యున్ని ఎలా ఆపలేరో.. అలాగే ఎన్టీఆర్ సినిమాలను కూడా ఎవరూ ఆపలేరని జూనియర్‌కు మద్దతుగా నిలిచారు రోజా.
►ALSO READ | తిరుపతిలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం.. మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి
ఎంత పెద్ద హీరో అయినా సినిమా బాగుంటేనే ప్రజలు చూస్తారని.. ఇందుకు పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమానే నిదర్శమన్నారు. హరిహర వీరమల్లు సినిమాను హిట్ చేయడం కోసం ఎమ్మెల్యేలు టికెట్ల కొన్నా కూడా ఆ చిత్రాన్ని ఎవరూ చూడలేదన్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎవరూ అడ్డుకోలేరు.. బాగోలేని సినిమాలను ఎవరూ ఆడించలేరన్నారు రోజా. రాజకీయ లబ్ధి కోసం సినిమాలు తీస్తే ప్రజలను వాటిని ఆదరించారని పవన్ కల్యాణ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు రోజా.