యూత్ను ఉర్రూతలూగిస్తున్న.. మనాలి స్కేట్‌బోర్డింగ్ వీడియో

యూత్ను ఉర్రూతలూగిస్తున్న.. మనాలి స్కేట్‌బోర్డింగ్ వీడియో

మీరెప్పుడైనా స్కేటింగ్ చేశారా..స్కేట్ బోర్డింగ్ గురించి తెలుసా..టీవల కాలంలో ఏ ఇండోర్ స్టేడియాల్లో, పార్కుల్లో, రోడ్లపై కాళ్లు వీల్స్ షూల్ వేసుకొని, చేతులకు గ్లౌజ్ లు తొడుక్కొని,తలపై హెల్మెట్ పెట్టుకొని స్కేటింగ్ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయి.. ముఖ్యంగా పిల్లలు, యువతను ఈ స్కేటింగ్ క్రీడ బాగా ఆకట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలిలో ఇటీవల ఓ విదేశీ పర్యాటకుడు సాహసోపేతమైన స్కోట్ బోర్డింగ్ చేస్తున్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతని పెర్మార్మెన్స్ చూసేవారిని బాగా ఆకట్టుకుంటోంది. అదేంటో చూద్దాం రండి.. 

భారతదేశంలో స్కేట్ బోర్డింగ్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. యువతలో ఈ క్రీడపై ఆసక్తి బాగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా స్కేట్ పార్కులు నిర్మిస్తున్నారు. గతంలో స్కేట్ బోర్డింగ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసేది కానీ ఇప్పుడు ఇది ఒక ప్రధాన క్రీడగా మారుతోంది. ఇక విదేశాల్లో ఈ క్రీడకున్న ప్రాముఖ్యత గురించి చెప్పనక్కర్లేదు. 

హిమాచల్ ప్రదేశ్ లోని పర్యాటక ప్రాంతం మనాలిలో ఆ విదేశీ పర్యాటకుడికి చెందిన సాహసోపేతమైన వీడియో వైరల్ అయింది. పచ్చని కొండల మధ్య, నీలిరంగు ఆకాశం కింద, ఆ విదేశీ పర్యాటకుడు హెల్మెట్, చేతి తొడుగులు, కాన్వాస్ బూట్లు ధరించి, రోడ్డుపై కార్లు, బైక్లు, ట్రక్కులు, ఆవులను జాగ్రత్తగా దాటుతూ జిగ్జాగ్ కదలికలతో స్కేటింగ్ ట్రిక్స్ చేస్తూ సాహసాన్ని చూపించాడు. 

►ALSO READ | డీజిల్ ట్యాంకర్ బోల్తా..బకెట్లు, బాటిల్స్, క్యాన్లతో ఎగబడ్డ జనం..వీడియో వైరల్

ఈ  దృశ్యం వీడియో గేమ్ ను పోలిన ఓ సాహసోపేత అనుభవాన్ని అందిస్తూ పర్యాటకులలో ఎక్సైట్ మెంట్ ను కలిగిస్తుంది. ఇది పర్యాటకులకు కొత్త రకమైన ఎడ్వెంచర్ స్పోర్ట్స్ అనుభవాలను అందిస్తూ సాహసోపేత ప్రయాణాలకు ప్రేరణగా కలిగిస్తుంది. 

అయితే ఇలాంటి సాహసాలు ప్రమాదాలకు గురవటానికి కూడా అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూసేవాళ్లు. కార్లు, బైకులు, పెద్ద వెహికల్స్, పెదవి జంతువుల మధ్య వేగంగా స్కేటింగ్ చేస్తున్నపుడు ప్రమాదం  జరిగే అవకాశాలు ఎక్కువే. చిన్న తప్పిదం జరిగినా నియంత్రణ కోల్పోయినా తీవ్ర ప్రమాదాలకు దారి తీయొచ్చు. ఈ కారణంగా ఎప్పుడూ జాగ్రత్తగా, పూర్తిగా సురక్షిత మార్గదర్శకాలు పాటిస్తూ మాత్రమే ఇలాంటి సాహసాలు చేయడం అవసరం అంటున్నారు. 

మనాలిలో ఈ వీడియో సాహసం, సాహసోపేత జ్ఞాపకాలను అందిస్తూ  పర్యాటకులలో ఉత్సాహాన్ని పెంచగా, మరో వైపు ప్రమాదాలతో జరిగే పర్యవసానాలను గుర్తు చేస్తుంది. సాహసం ఎప్పుడూ సేఫ్ గా ఉండాలి. ఇలాంటి సాహసాలు అద్భుతమైన అనుభవాలనిస్తాయి కానీ వాటితో కూడిన ప్రమాదాలను ఏకాగ్రతతో, జాగ్రత్తతో మాత్రమే ఎదుర్కోవాలని గుర్తు చేస్తుంది.