
పుకట్కు వస్తే ఫినాయిల్ కూడా వదలరు అనే సామెత ఎప్పుడైన విన్నరా.. ఇగో గీళ్లకు అది సరిగ్గా సరిపోతది..ట్యాంకర్ బోల్తా పడి ఆళ్ల పరేషాన్ల ఆళ్లుంటే.. సాయం చేయాల్సింది పోయి..పెద్ద పెద్ద బకెట్లు, బాటిళ్లు, క్యాన్లు పట్టుకొని డీజిల్ కోసం ఉరుకుల బెడుతున్నరు. పొరపాటున అగ్గి అంటుకుంటే ఏమన్నా ఉందా..జరగరానిది జరిగితే ఎవలు బాధ్యులు.. పంద్రాగస్టున యూపీలోని సోన్ భద్రలో డీజిల్ ట్యాంకర్ బోల్తాపడితే జనాలు ఏం చేసిన్రో చూడుర్రి..
उत्तर प्रदेश : जिला सोनभद्र में डीजल से भरा टैंकर पलट गया। 20 हजार लीटर डीजल सड़क पर बह गया। आसपास के गांववाले बाल्टी–डब्बों में डीजल भरकर ले गए। pic.twitter.com/DnxqCXN8wH
— Anurag Verma ( PATEL ) (@AnuragVerma_SP) August 15, 2025
ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో డీజిల్ నిండిన ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదంలో బాధితులకు సహాయం చేయాల్సి పోయి డీజిల్‌ను దోచుకోవడానికి సమీప గ్రామాల గ్రామస్తులు ఎగబడ్డారు. డీజిల్ కోసం గ్రామస్తుల మధ్య బాటిళ్లు, బకెట్లు వంటి కంటైనర్లను తీసుకువచ్చి నింపుకున్నారు. ఈ సంఘటన చోపాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కుండి లోయలో జరిగింది. వైరల్ క్లిప్ గ్రామస్తుల భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.
सोनभद्र
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) August 15, 2025
➡मारकुंडी घाटी में डीजल का टैंकर पलटा
➡हादसे में ट्रक क्लीनर हुआ गंभीर घायल
➡डीजल को लूटने के लिए मौके पर जुटी भीड़
➡घायल क्लीनर जिला अस्पताल में भर्ती
➡चोपन थाना क्षेत्र के मारकुंडी घाटी की घटना#Sonbhadra #DieselTankerAccident #Injury #MarkundiValley… pic.twitter.com/5wXPSx9ItT
ఇంధనంతో నిండిన ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడటంతో 20వేల లీటర్లకు పైగా డీజిల్ రోడ్డుపై చిందింది. ఇది చూసిన సమీప ప్రాంతాలు ,గ్రామాల నుంచి గ్రామస్తులు డీజిల్ కోసం ఎగబడ్డారు. డీజిల్ కోసం ప్రజలు ఎగబడుతున్నట్లు దృశ్యాల్లో కనిపిస్తుంది. అదృష్ట బాగుండి ఏం జరగలేదు గానీ.. పొరపాటున నిప్పు గనక అంటుకొని ఉండే వారి పరిస్థితి ఏంటని ఈ వీడియో చూసిన వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ కోసం ప్రాణాలు పణంగా పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన ద్వారా ప్రజల్లో ప్రమాదాలపై అవగాహన పెరగాల్సిన అవసరం ఎంత ముఖ్యమో స్పష్టమైంది. ప్రమాద స్థలాల్లో పోలీసుల సూచనలు పాటించడమే కాదు..ప్రాణాలకు ప్రాధాన్యతనిచ్చే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. ఆర్థిక ప్రయోజనం కోసం ప్రమాదాన్ని లెక్కచేయకుండా వ్యవహరించే ప్రవర్తన వల్ల ఏ సమయంలోనైనా ఘోర ప్రమాదం జరగొచ్చు.