IPL:  ముంబై ఇండియన్స్ VS రాయల్ చాలెంజర్స్

IPL:  ముంబై ఇండియన్స్ VS రాయల్ చాలెంజర్స్

గాయపడ్డ జస్ప్రీత్‌ బుమ్రా మళ్లీ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ముంబై ఇండియన్స్‌ జట్టులో ఉత్సాహం నింపనున్నాడు. ఇవాళ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. రెండు జట్లలో స్టార్‌ ఆటగాళ్లుండటంతో పోటీ రసవత్తరంగా ఉంటుందని అభిమానులు అశిస్తున్నారు. ఆర్‌సీబీ జట్టులో విరాట్‌ కోహ్లీ ఉండగా, ముంబై ఇండియన్స్‌ జట్టులో ప్రపంచంలోనే బుమ్రా ఉన్నాడు.

ముంబై ఇండియన్స్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో బుమ్రా భుజానికి గాయం కావడంతో.. చేజింగ్‌ సమయంలో బుమ్రా బ్యాటింగ్‌కు దిగలేదు. గాయం నుంచి బుమ్రా కోలుకోవటంతో రోహిత్‌ నేతృత్వంలోని ముంబై జట్టు ఉత్సాహంలో ఉంది. రెండు జట్లు టోర్నీలో తమ తొలి విజయాన్ని నమోదుచేయడనికి ఉవ్విళ్లూరుతున్నాయి. అటు కోహ్లీ, ఇటు రోహిత్‌లు ఇద్దరు కూడా తమ తొలి మ్యాచుల్లో బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్‌ లసిత్‌ మలింగా కూడా ముంబై జట్టుకు త్వరలో అందుబాటులోకి రానుండటంతో ఆజట్టు బలం పెరిగింది. యువరాజ్‌ సింగ్‌ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసి మంచి ఊపులో ఉన్నాడు. అతనికి తోడుగా మిచెల్‌ మెక్‌ క్లెంగాన్‌, డికాక్‌, తదితర ఆట గాళ్లుండగా, వీరికి సవాల్‌గా ఆర్‌సీబీ తరపున కోహ్లీ, డివిల్లిర్స్‌, హెట్‌మెయిర్‌ తదితర ఆటగాళ్లున్నారు. యజువేంద్ర చాహల్‌ ఆర్‌సీబీ బౌలర్లలో మళ్లీ ప్రధాన బౌలర్‌గా కీలక పాత్ర పోషించనున్నాడు.