
- ఆగడం తొలిసారి కాదు
18 ఏండ్ల ఐపీఎల్ చరిత్రలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, సైనిక చర్య కారణంగా లీగ్‌కు ఆటకం కలగడం ఇదే తొలిసారి. అయితే, ఐపీఎల్ ఆగిపోవడం మాత్రం ఇది మొదటి సారి కాదు. 2009లో ఎలక్షన్స్ కారణంగా మొత్తం లీగ్‌ను సౌతాఫ్రికాకు షిష్ట్ చేశారు.
కరోనా కారణంగా ఏప్రిల్–మే విండోలో ఐపీఎల్ సాధ్యం కాకపోవడంతో 2020లో సెప్టెంబర్‌లో యూఈఏలో టోర్నీని నిర్వహించారు. ఆ తర్వాతి ఏడాది ఇండియాలో బయో బబుల్‌లో లీగ్‌ను మొదట్టినా.. ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఆట మధ్యలో ఆగింది. చివరకు సెప్టెంబర్‌లో యూఏఈలోనే ఆటను పూర్తి చేశారు.
ఆటగాళ్ల తిరుగు ప్రయాణం..
బీసీసీఐ సెక్రటరీ సైకియా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్, బీసీసీఐ సీనియర్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఐపీఎల్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత వాతావరణంలో ఆటను కొనసాగించడం సముచితం కాదని అంతా ఏకగ్రీవంగా అంగీకరించారని తెలుస్తోంది. మధ్యాహ్నం 2.40 గంటలకు ఈ ప్రకటన చేయడానికి ముందే అన్ని ఫ్రాంచైజీలకు వాయిదా గురించి సమాచారం అందింది.
ధర్మశాలలో ఉన్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల ప్లేయర్లు, సిబ్బంది మొత్తం 40 మందిని చిన్న చిన్న వాహనాల్లో భారీ భద్రత నడుమ రోడ్డు మార్గాన జలంధర్‌కు తరలించారు. అక్కడి నుంచి వాళ్లు రైల్లో ఢిల్లీకి పయణం అయ్యారు. ఇతర ఫ్రాంచైజీలు కూడా తమ ప్లేయర్లను వారి స్వస్థలాలకు చేరుస్తున్నాయి.