
న్యూఢిల్లీ: వచ్చే సీజీన్ ఐపీఎల్ లో చాలా మంది ఆటగాళ్లను జట్లు వదులుకున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కుగుడ్ బై చెప్పింది. మొత్తం 12 మందిని వదిలేసినముంబై.. ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న లంకపేసర్ లసిత్ మలింగను అట్టిపెట్టుకుం ది. ప్లేయర్లట్రేడ్ విండో గురువారంతో ముగియడంతో.. తమటీమ్ ల్ లో ఉన్న మరికొంత మంది క్రికెటర్లను ఆయాఫ్రాంచైజీలు శుక్రవారం రిలీజ్ చేశాయి. వీరందరు డిసెంబర్ 19న కోల్‌కతాలో జరిగే వేలంలో అందుబాటులో ఉంటారు. సన్ రైజర్స్ హైదరాబాద్ అత్యల్పంగా ఐదుగుర్ని రిలీజ్ చేసింది. ఎనిమిదిఫ్రాంచైజీలు 35 మంది ఫారెన్ క్రికెటర్లతో సహా 127మంది క్రికెటర్లను రిటేన్ చేసుకోగా, 71 మందిని వదులుకున్నాయి. ఈ ఏడాది వేలంలో రూ. 7.2 కోట్లకుకొనుగోలు చేసిన శామ్ కరన్ కు పంజాబ్ ఉద్వాసన పలికింది. తెలుగు క్రికెటర్లు హనుమ విహారిని.. ఢిల్లీక్యాపిటల్స్ , యర్రా పృథ్వీ రాజ్ ను కోల్‌కతా వేలంలోకి పంపాయి.
హైదరాబాద్: దీపక్ హుడా, మార్టిన్ గప్టిల్, రికీభుయ్ , షకీబల్ హసన్ , యూసుఫ్ పఠాన్ .
బెంగళూరు: అక్షదీప్ నా థ్ , గ్రాండ్ హోమ్,స్టెయిన్ , క్లాసెన్ , హిమ్మత్ సింగ్ , కెజ్రోలియా, స్టొయినిస్ , మిలింద్ కుమార్ , కోల్టర్ నీల్, ప్రయాస్‌రే బర్మన్ , హెట్ మెయర్ , టిమ్ సౌతీ.
చెన్నై: శామ్ బిల్లింగ్ స్ , మొహిత్ శర్మ, డేవిడ్ విల్లీ,చైతన్య బిష్నోయ్ , ధృవ్ షోరే, కుగ్గిలైన్ ,
ఢిల్లీ: అన్కుష్ బెయిన్స్ , బండారు అయ్యప్ప,క్రిస్ మోరిస్ , కొలిన్ ఇంగ్రామ్ , హనుమ విహారి,జలజ్ సక్సేనా, మన్జో త్ కల్రా, నాథు సింగ్.
పంజాబ్ : అగ్నివేశ్ అయాచి, ఆండ్రూ టై,మిల్లర్ , హెన్రీకస్ , ప్రభ్ సి మ్రన్ సింగ్ , శామ్‌కరన్ , వరుణ్ చక్రవర్తి.
కోల్ కతా: నోర్జ్, బ్రాత్ వైట్ , క్రిస్ లిన్ , జో డెన్లీ,కరియప్ప, మాట్ కెల్లీ, నిఖిల్ నాయక్ , పీయూష్‌చావ్లా, యర్రా పృథ్వీ రాజ్ , రాబిన్ ఉతప్ప,శ్రీకాం త్ ముండే.
ముంబై: ఆడమ్ మిల్నే , అల్జరి జోసెఫ్ , బరీందర్‌శరణ్ , బెన్ కట్టిం గ్ , బెరున్ హెం డ్రిక్స్ , ఎవిన్‌లూయిస్ , బెరెన్ డార్ఫ్ , పంకజ్ జస్వాల్, రషిక్‌ధార్ , యువరాజ్ సింగ్ .
రాజస్థాన్ : అర్యమన్ బిర్లా, ఆస్టన్ టర్నర్ , ఇష్‌సోధీ, జయ్ దేవ్ ఉనాద్కట్ , లివింగ్ స్టోన్,ఒషేన్ థామస్ , ప్రశాంత్ చోప్రా, రాహుల్ త్రిపాఠి, శుభమ్ రంజానె, స్టువర్ట్ బిన్నీ, సుదేశన్‌మిథున్