
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
ఐపీఎల్ కు తమదైన స్టైల్లో రెడీ అవుతున్న టీమ్స్
దుబాయ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ టీమ్స్‌గా విడిపోయి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడితే.. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ప్లేయర్లు తమ భార్యాపిల్లలతో బీచ్‌లో ఆహ్లాదంగా గడిపారు. మరోవైపు ముంబై స్పీడ్ స్టర్జస్ప్రీత్ బుమ్రా ఆరుగురు బౌలర్ల స్టయిల్లో బౌలింగ్ చేసి అలరిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నెట్స్‌లో లెగ్ స్పిన్ వేసి ఆకట్టుకున్నాడు. కొన్ని రోజుల క్రితమే క్వారంటైన్ పూర్తి చేసుకుని పంజాబ్ టీమ్‌తో కలిసిన యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ తనదైన శైలితో టీమ్‌మేట్స్‌ను అలరిస్తున్నాడు. ఇలా ఐపీఎల్ టీమ్స్ అన్ని ఓవైపు జోరుగా ప్రాక్టీస్ చేస్తూనే ఇంకోవైపు రిఫ్రెష్ అవుతున్నాయి.
ముంబై ఫ్యామిలీ.. బీచ్‌లో జాలీగా..
యూఏఈలో హీట్ ఎక్కువగా ఉండటంతో అన్ని ఫ్రాంచైజీలు తమ క్రికెటర్ల హెల్త్‌పై కూడా దృష్టిపెట్టాయి. మధ్యాహ్నం ఎండ భారీగా ఉండడంతో దాదాపు అన్ని జట్లూ ఉదయం, సాయంత్రం మాత్రమే నెట్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి. అలాగే, ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగి అలసిపోకుండా చూసుకుంటున్నాయి. వారిని ఉల్లాసంగా ఉంచేందుకు రకరకాల కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అయితే తమ ప్లేయర్ల కోసం ఓ స్పెషల్ గేమింగ్ రూమ్‌నే ఏర్పాటు చేసింది. ఆ టీమ్ ప్లేయర్లు తమ ఫ్యామిలీస్‌తో కలిసి అబుదాబి వెళ్లారు. మొన్నటిదాకా ప్రాక్టీస్‌లో మునిగిన రోహిత్ అండ్ కో.. మంగళవారం తమ కుటుంబ సభ్యులతో దగ్గర్లోని బీచ్‌లో సాయంత్రం ఎంజాయ్ చేశారు. ఈ ఫొటోలను ముంబై టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కెప్టెన్ రోహిత్,రితిక దంపతులు తమ కూతురు సమైరాను బీచ్‌లో ఆడించారు. సూర్యకుమార్ యాదవ్, ధవళ్ కులకర్ణి కూడా తమ ఫ్యామిలీస్‌తో ఆహ్లాదంగా గడిపారు.
కోహ్లీ హాట్‌డాగ్స్ x డివిలియర్స్ కూల్ క్యాట్స్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రాక్టీస్‌లో కూడా కోహ్లీ ఫుట్‌బాల్‌కు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. సాకర్ మ్యాచ్‌తో ఐపీఎల్ సీజన్‌ను ప్రారంభించడం ఆర్సీబీ ఆనవాయితీ అని ఆ టీమ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ శంకర్ బసు తెలిపాడు. ఇక, ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ మొత్తం మంగళవారం పూర్తిస్థాయి ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. సంప్రదాయ ఈ సెషన్‌కు ముందు ప్లేయర్లు రెండు టీమ్స్ (కోహ్లీ హాట్ డాగ్స్, డివిలియర్స్ కూల్ క్యాట్స్)గా విడిపోయి తమలో తాము ఫుల్‌బాల్ ఆడుకున్నారు. ప్రతి ప్లేయర్ఈక్వల్ ఇంటెన్సిటీతో ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేసేలా చూసుకున్నాడు బసు. గోల్ కీపర్లేకపోయినా.. రియల్ సాకర్ గేమ్ మాదిరిగా దీన్ని నిర్వహించాడు. మ్యాచ్ టైమ్‌లో ఫౌల్ చేసినందుకు డేల్ స్టెయిన్‌కు రెడ్ కార్డ్ చూపించిన రెఫరీ..మహమ్మద్ సిరాజ్‌కు ఎల్లో కార్డు ఇచ్చాడు.
బుమ్రా.. ఆరు స్టయిల్స్‌లో బౌలింగ్
ముంబై ఇండియన్స్ యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఓ చేతిని ముందుకు పెట్టి బంతులు వేసే అతని శైలిని మరొకరు అనుకరించలేరు. అయితే ముంబై ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా.. ఇంకో ఆరు రకాలుగా బౌలింగ్ చేశాడు. ప్రస్తుత, మాజీ ఆటగాళ్ల బౌలింగ్ యాక్షన్‌ను ఇమిటేట్ చేసి అలరించాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ముంబై.. బుమ్రా ఇమిటేట్ చేసిన ఆరుగురు బౌలర్లు ఎవరో చెప్పండి? అని అడిగింది. దాంతో ఫ్యాన్స్ పలువురు బౌలర్ల పేర్లు చెప్పారు. లసిత్ మలింగ, మెక్‌గ్రాత్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే అంటూ కామెంట్లు చేశారు. వీడియో చివర్లో సూర్య కుమార్ యాదవ్… బుమ్రా స్టయిల్‌ను అనుకరించడం బోనస్.
పేస్ బ్యాటరీ వర్సెస్ గేల్ స్ట్రోమ్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్రెయినింగ్ జోరుగా సాగుతోంది. ఈ మధ్యే టీమ్‌తో కలిసిన క్రిస్ గేల్ తన ట్రేడ్‌మార్క్ షాట్లకు మెరుగులు దిద్దుకుంటున్నాడు. ఇండియా స్పీడ్ స్టర్ మహమ్మద్ షమీ బౌలింగ్‌ను ఎదుర్కొంటున్న వీడియోను పంజాబ్ షేర్ చేసింది. దానికి ‘పేస్ బ్యాటరీ వర్సెస్ గేల్ స్టార్మ్’ అని క్యాప్షన్ ఇచ్చింది.
For More News..