IPL విజేతల లిస్ట్.. ఆర్సీబీ తొలి ట్రోఫీ వరకు ఫుల్ జాబితా ఇదే.. మరీ ఈసారి గెలిచేది ఎవరు!

IPL విజేతల లిస్ట్.. ఆర్సీబీ తొలి ట్రోఫీ వరకు ఫుల్ జాబితా ఇదే.. మరీ ఈసారి గెలిచేది ఎవరు!

IPL Trophy Winners: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) అంటేనే క్రికెట్ లవర్స్‌కు పూనకాలు తెప్పించే పండుగ. నరాలు తెగే ఉత్కంఠ, మైండ్ బ్లోయింగ్ సిక్సర్లు, ఊహించని ట్విస్టులతో ప్రతి సీజన్ నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. 2008లో అండర్ డాగ్స్‌గా వచ్చి రాజస్థాన్ చేసిన రచ్చ నుంచి 2025లో 18 ఏళ్ల ట్రోల్స్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ ఆర్‌సీబీ కప్ కొట్టిన హిస్టారికల్ మూమెంట్ వరకు ఐపీఎల్ ఫైనల్స్ విన్నర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

సీజన్ వైజ్ 'రచ్చ రంభోలా' మూమెంట్స్: 
* 2008 – రాజస్థాన్ రాయల్స్ (ది ఫెయిరీ టేల్ స్టార్ట్): ఎవరూ ఊహించని విధంగా, ఎలాంటి స్టార్ ప్లేయర్స్ లేకుండానే షేన్ వార్న్ తన యంగ్ టీమ్‌తో అద్భుతం చేశాడు. ఫియర్ లెస్ గేమ్‌తో తొలి ఐపీఎల్ కప్‌ను ముద్దాడి హిస్టరీ క్రియేట్ చేశారు.

* 2009 – డెక్కన్ చార్జర్స్ (ఫ్రమ్ బాటమ్ టు టాప్): ఫస్ట్ సీజన్‌లో లాస్ట్ ప్లేస్‌లో నిలిచిన డెక్కన్ చార్జర్స్ (హైదరాబాద్), సౌతాఫ్రికాలో జరిగిన సెకండ్ సీజన్‌లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ పవర్ ప్యాక్డ్ కెప్టెన్సీతో అల్టిమేట్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఫైనల్లో ఆర్‌సీబీకి షాకిస్తూ ట్రోఫీ గెలిచింది. 

* 2010 – చెన్నై సూపర్ కింగ్స్ (తలా సామ్రాజ్యం షురూ): మహేంద్ర సింగ్ ధోని తన మైండ్‌సెట్‌తో సీఎస్‌కేకి ఫస్ట్ ఐపీఎల్ కప్ అందించాడు. ముంబై ఇండియన్స్‌ను ఫైనల్లో చిత్తుగా ఓడించి, ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఎదిగేందుకు పునాది వేశారు.

* 2011 – చెన్నై సూపర్ కింగ్స్ (బ్యాక్ టు బ్యాక్ రూలింగ్): సీఎస్‌కే హోమ్ గ్రౌండ్‌లో చెలరేగిపోయింది. ఫైనల్లో మురళీ విజయ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్‌సీబీని ఊచకోత కోసి, వరుసగా రెండోసారి టైటిల్‌ను డిఫెండ్ చేసుకుని కింగ్స్ తమని తాము నిరూపించుకుంది. 

* 2012 – కోల్‌కతా నైట్ రైడర్స్ (సీఎస్‌కేకు ప్యాకప్): ఫుల్ ఫామ్‌లో ఉన్న చెన్నైని వారి హోమ్ గ్రౌండ్‌లోనే కొట్టి KKR ఫస్ట్ టైమ్ కప్ కొట్టింది. అన్‌సంగ్ హీరో మన్విందర్ బిస్లా ఆడిన 89 రన్స్ మెరుపు ఇన్నింగ్స్ గేమ్ చేంజర్. 

* 2013 – ముంబై ఇండియన్స్ (హిట్‌మ్యాన్ ఎరా బిగినింగ్): కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న ఫస్ట్ సీజన్‌లోనే రోహిత్ శర్మ ముంబైకి తొలి కప్ అందించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్లో సీఎస్‌కేపై సాలిడ్ విన్ నమోదు చేసుకుంది.  

* 2014 – కోల్‌కతా నైట్ రైడర్స్ (గంభీర్ యాటిట్యూడ్.. ఉతప్ప రాంపేజ్): గౌతమ్ గంభీర్ అగ్రెసివ్ కెప్టెన్సీ, రాబిన్ ఉతప్ప కిరాక్ ఫామ్‌తో కేకేఆర్ ఐపీఎల్ ని వణికించింది. ఫైనల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన హై-స్కోరింగ్ థ్రిల్లర్‌లో గెలిచి సెకండ్ టైమ్ కప్ అందుకుంది. 

* 2015 – ముంబై ఇండియన్స్ (వరస్ట్ స్టార్ట్.. మాస్ ఎండింగ్): టోర్నమెంట్ ఆరంభంలో వరుసగా ఓడిపోయిన ముంబై, ఆ తర్వాత ఫీనిక్స్ పక్షిలా పుంజుకుంది. ఫైనల్లో లెండ్ల్ సిమన్స్, రోహిత్ శర్మ రెచ్చిపోవడంతో సీఎస్‌కేపై వన్ సైడెడ్ గా గెలిచింది. 

* 2016 – సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఆరెంజ్ ఆర్మీ అరాచకం): డేవిడ్ వార్నర్ ఒంటిచేత్తో టీమ్‌ను నడిపించిన సీజన్ ఇది.. ఫైనల్లో విరాట్ కోహ్లీ ఆర్‌సీబీని వారి హోమ్ గ్రౌండ్‌లోనే దెబ్బకొట్టి సన్‌రైజర్స్ తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

* 2017 – ముంబై ఇండియన్స్ (గుండె ఆగిపోయే రేంజ్ థ్రిల్లర్): రైజింగ్ పూణే సూపర్‌జైంట్‌తో జరిగిన ఫైనల్లో ముంబై కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచింది. లాస్ట్ ఓవర్‌లో ముంబై బౌలర్లు చూపించిన సినిమా నెక్స్ట్ లెవెల్. 

* 2018 – చెన్నై సూపర్ కింగ్స్ (ది గ్రేట్ కమ్‌బ్యాక్ - డాడ్స్ ఆర్మీ): రెండేళ్ల బ్యాన్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చెన్నై.. తామేంటో మళ్లీ నిరూపించుకుంది. ఫైనల్లో సన్‌రైజర్స్‌పై షేన్ వాట్సన్ సింగిల్ హ్యాండ్‌తో సెంచరీ బాది ప్యూర్ మధురమైన జ్ఞాపకాలను అందించాడు. 

* 2019 – ముంబై ఇండియన్స్ (మళ్లీ వన్ రన్ మ్యాజిక్): హిస్టరీ రిపీట్స్! ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఫైనల్లో సీఎస్‌కేపై ముంబై మళ్లీ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. జస్‌ప్రీత్ బుమ్రా డెత్ బౌలింగ్ అరాచకానికి సీఎస్‌కే తలవంచక తప్పలేదు.

* 2020 – ముంబై ఇండియన్స్ (అన్‌స్టాపబుల్ జోరు): కోవిడ్ టైమ్‌లో యూఏఈలో జరిగిన ఈ సీజన్‌లో ముంబైని ఆపడం ఎవరి తరం కాలేదు.. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఈజీగా ఊడ్చేసి, రికార్డు స్థాయిలో 5వ సారి కప్ ని సొంతం చేసుకుంది. 

ALSO READ : వైభవ్ మామూలు ఆటగాడు కాదు..

* 2021 – చెన్నై సూపర్ కింగ్స్ (గాయపడిన సింహం ఫామ్ లోకి వస్తే): గత (2020) సీజన్ నిరాశను మర్చిపోతూ సీఎస్‌కే దుబాయ్‌లో గర్జించింది. ఫైనల్లో కేకేఆర్‌పై ఫాఫ్ డు ప్లెసిస్ మెరుపులతో మ్యాచ్‌ను వన్ సైడ్ చేసి ఫోర్త్ టైమ్ కప్ కొట్టారు.

* 2022 – గుజరాత్ టైటాన్స్ (డెబ్యూ లోనే టాప్ లేపారు): సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, ఫస్ట్ సీజన్ లోనే లీగ్‌ను షేక్ చేసింది. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షోతో రాజస్థాన్ రాయల్స్‌ను ఫైనల్లో చిత్తు చేసి మొదటి ట్రోఫీ ఎత్తుకుంది.

* 2023 – చెన్నై సూపర్ కింగ్స్ (జడేజా.. యు బ్యూటీ): వర్షం వల్ల అర్ధరాత్రి దాటాక జరిగిన హై-డ్రామా ఫైనల్ ఇది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లాస్ట్ 2 బాల్స్‌కు సిక్స్, ఫోర్ కొట్టి రవీంద్ర జడేజా సీఎస్‌కేకు 5వ కప్ అందించి తలా ఫ్యాన్స్‌కు ప్యూర్ గూస్‌బంప్స్ వచ్చేలా చేశాడు. 

2024 – కోల్‌కతా నైట్ రైడర్స్ (ఫియర్ లెస్ గేమ్‌ప్లే): శ్రేయస్ అయ్యర్ లీడర్‌షిప్‌లో కేకేఆర్ ఈ సీజన్ అంతా వన్-సైడెడ్ డామినేషన్ చూపించింది. ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైన్‌అప్‌ను ప్యాకప్ చేసేసి, సులువుగా థర్డ్ టైటిల్ అందుకుంది. 

2025 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (18 ఏళ్ల కల.. ‘ఈసాలా కప్ నమ్దే’ నిజమైంది!): ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఇన్నాళ్లూ పడ్డ అవమానాలకు, ట్రోల్స్‌కు ఎండ్ కార్డ్ పడింది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో నిలకడైన ఆటతీరుతో దూసుకెళ్లిన బెంగళూరు.. ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఎట్టకేలకు తమ మొట్ట మొదటి ఐపీఎల్ కప్‌ను ముద్దాడి హిస్టారికల్ విక్టరీ నమోదు చేసుకుంది. 

* 2026 – (ఏ జట్టు గెలిచిన రెండో ట్రోఫీనే): ఈ సీజన్ లో ఇప్పటికే ఆర్సీబీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ కి దూసుకెళ్లింది. దీంతో మే 29న జరగబోయే క్వాలిఫయర్2లో  రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచులో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్ కి వెళ్తుంది. ఇక ఫైనల్ లో ఏ విజయం సాధించిన ఈ ఐపీఎల్ లో రెండో ట్రోఫీ కొట్టిన జట్టుగా నిలుస్తుంది. కాగా క్రీడా విశ్లేషకుల అంచనా ప్రకారం ఈసారీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీ సాధించేందుకు ఎడ్జ్ ఉందని పేర్కొన్నారు.