IPL వేలంలోకి వస్తే వైభవ్ ఎంత ధర పలుకుతడు..? సెహ్వాగ్ ఆన్సర్ ఇదే

IPL వేలంలోకి వస్తే వైభవ్ ఎంత ధర పలుకుతడు..? సెహ్వాగ్ ఆన్సర్ ఇదే

వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మోరుమోగిపోతుంది. ఎక్కడ చూసిన ఇతడి గురించే చర్చ.  సోషల్ మీడియాలోనైనా.. ఇద్దరూ క్రికెట్ అభిమానులు కలిసినా ఈ బుడ్డోడి విధ్వంసకర బ్యాటింగ్ గురించే డిస్కషన్. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‎లో క్రిస్ గేల్ వంటి దిగ్గజాల ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొడుతూ క్రికెట్‎లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. అయితే, ఐపీఎల్‎లో సిక్సర్లతో విరుచుకుపడుతూ పరుగుల వరద పారిస్తున్న ఈ బుడ్డోడు ఐపీఎల్ వేలంలో ఎంత ధరకు అమ్ముడుపోతాడనే దానిపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 

వైభవ్ ఒకవేళ ఐపీఎల్ ఆక్షన్‎లోకి వస్తే ఏకంగా రూ.30 కోట్లు పెట్టి కొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నాడు సెహ్వాగ్. అతడి విధ్వంసానికి రూ.30 కోట్లు కూడా తక్కువేననన్నాడు. బుడ్డోడి ఆటకు తాను ఫిదా అయిపోయానన్నాడు. ముఖ్యంగా ఎలిమినేటర్ మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్‎పై వైభవ్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ వేరే లెవల్ అన్ని ప్రశంసించాడు. మరో భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా సైతం సెహ్వాగ్ అభిప్రాయంతో ఏకీభవించాడు. తాను కూడా ఏ మాత్రం సంకోచించకుండా అంతే మొత్తాన్ని వైభవ్ కోసం ఆఫర్ చేస్తానని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. 

కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలంలో వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన కోటీశ్వరుడిగా అతడు రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‎లో ఇప్పటి వరకు అత్యధిక వేతనం అందుకుంటున్న ఆటగాడు రిషబ్ పంత్.

 లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ పంత్‎ను ఏకంగా రూ. 27 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. వైభవ్ వేలంలోకి వస్తే రూ.30 కోట్లు పెట్టి కొంటానని సెహ్వాగ్ పేర్కొనడంతో ఈ అంశంపై చర్చ జరుగుతోంది. నిజంగానే వైభవ్ వేలంలోకి వస్తే మాత్రం భారీ ధర పలకడం ఖాయం. ఫ్రాంచైజీలు అతడి కోసం పోటీ పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.