ఇడ్లీ, దోశ, పూరీ, బోండా.. కాలేజీల్లో స్టూడెంట్స్కు ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ !

ఇడ్లీ, దోశ, పూరీ, బోండా.. కాలేజీల్లో స్టూడెంట్స్కు ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ !

హైదరాబాద్: కొన్నేండ్లుగా ఇంటర్ విద్యార్థులకు మిడ్డే మీల్స్ అందించాలనే డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే గతేడాది ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు చేయగా, సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ పెట్టేందుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గ్రామాలు, తండాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం పూట తినేందుకు సమయం లేక, మధ్యాహ్నం క్యారియర్ తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సర్కారు స్కూల్ విద్యార్థులకు అందించినట్టుగానే.. కాలేజీల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ మెనూ రూపొందించారు.

దోశ, మిల్లెట్ ఇడ్లీ, పూరీ, బోండా, ఉప్మా తదితర వాటిని అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల క్రింత ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష.. అధికారులు, ట్రస్టులతో సమావేశమై దీనిపై చర్చించారు.

విద్యార్థులకు అదనపు పోషకాల కోసం మిడ్డేమీల్స్, బ్రేక్ ఫాస్ట్ తో పాటు పాలు, రాగిజావా కూడా ఇవ్వాలని నిర్ణయించారు. వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగిజావ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. 150 మిల్లీలీటర్ల పాలు, 250 మిల్లీలీటర్ల రాగిజావ ఇవ్వనున్నారు. దీనికోసం విజయ డైరీ, అన్నపూర్ణ ట్రస్టుతోనూ అధికారులు సమావేశమయ్యారు. ఇది కూడా బ్రేక్ ఫాస్ట్ స్కీంతో పాటు అమలు చేయనున్నారు.

బ్రేక్‌ ఫాస్ట్ మెనూ ఇదే..

  • సోమవారం-దోశ + చట్నీ
  • మంగళవారం-మిల్లెట్ ఇడ్లీ + సాంబార్
  • బుధవారం-పూరీ + మిక్స్‌డ్ వెజిటెబుల్ కుర్మా
  • గురువారం-బోండా + చట్నీ
  • శుక్రవారం-ఇడ్లీ + చట్నీ
  • శనివారం-ఉప్మా + చట్నీ/సాంబార్