వైభవ్ కోసం ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. రూ.30 కోట్ల అపార్ట్‌మెంట్ ఆఫర్?

వైభవ్ కోసం ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. రూ.30 కోట్ల అపార్ట్‌మెంట్ ఆఫర్?

IPL 2026 Final: ఐపీఎల్(IPL 2026) లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకే ఒక్కడి పేరు మారుమోగిపోతోంది. అతడే రాజస్థాన్ రాయల్స్ (RR) ప్లేయర్ 15 ఏళ్ల యంగ్ ఓపెనింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. తన ఫియర్ లెస్ బ్యాటింగ్, ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ రికార్డుల వేటతో ఈ సీజన్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లతో 97 రన్స్ కొట్టిన ఈ వండర్ కిడ్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ రేంజ్ పాపులారిటీతో పాటే అతనిపై నెట్టింట క్రేజీ రూమర్స్ కూడా షురూ అయ్యాయి. తాజాగా ముంబై ఇండియన్స్ ఈ టీనేజ్ సూపర్‌స్టార్‌కు ఏకంగా రూ. 30 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను ఆఫర్ చేసిందంటూ కొన్ని పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.  

ఐపీఎల్ 2026లో వైభవ్ రచ్చ రచ్చ: 
ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు.. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వచ్చి దిగ్గజ బౌలర్లకే చుక్కలు చూపించాడు. 
* సిక్సర్ల కింగ్: ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
* అన్‌క్యాప్డ్ రికార్డ్: ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు (650+ రన్స్) చేసిన అన్‌క్యాప్డ్ బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
* స్ట్రైక్ రేట్ విధ్వంసం: 240+ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ టీ20 క్రికెట్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశాడు.
* ఫాస్టెస్ట్ ప్లేఆఫ్స్ ఫిఫ్టీ: ఎలిమినేటర్‌లో కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి జాయింట్-ఫాస్టెస్ట్ రికార్డును అందుకున్నాడు.

రూ.30 కోట్ల అపార్ట్‌మెంట్ ఆఫర్: 
సోషల్ మీడియా పేజీలు చెప్తున్నట్లు ముంబై ఇండియన్స్ ఓనర్షిప్ వైభవ్‌ను తమ టీమ్‌లోకి లాగేసుకోవడానికి రూ. 30 కోట్ల ఫ్లాట్ లేదా మాల్దీవుల్లో ప్రైవేట్ ఐలాండ్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. 

ఈ రూమర్స్ వెనుక ట్విస్ట్: 
* ఇంటర్నెట్ చేసిన తప్పు: వైభవ్ సూర్యవంశీ ఇటీవల తన క్రికెట్ కెరీర్ ట్రైనింగ్ కోసం ముంబైలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశాడు. దాని అసలు విలువ రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్లు మాత్రమే.. కానీ కొందరు సోషల్ మీడియా నెటిజన్లు ఆ నెంబర్‌కు ఒక 'సున్నా (0)' అదనంగా చేర్చి రూ. 30 కోట్ల ఇల్లు అంటూ వైరల్ చేసేశారు. ఆ బిల్డింగ్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ గిఫ్ట్‌గా ఇచ్చిందంటూ స్టోరీలు అల్లేశారు. ఈ విషయాన్ని మాజీ ఐపీఎల్  ఛైర్మన్ లలిత్ మోడీ ఎక్స్ వేదికగా ఖండించారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక ప్లేయర్‌ను మిడ్-సీజన్‌లో ఇలా అండర్-ది-టేబుల్ ఆఫర్లతో సొంతం చేసుకోవడం అసాధ్యం అన్నారు. ఒకవేళ వైభవ్ ముంబై టీమ్‌లోకి వెళ్లాలన్నా.. రాజస్థాన్ రాయల్స్ అఫీషియల్ ట్రేడింగ్ విండోలో ఒప్పుకోవాలి, లేదా ఆర్‌ఆర్ రిలీజ్ చేస్తే వేలంలోకి రావాల్సి ఉంటుంది.

క్రికెట్ ని ఎంజాయ్ చేయండి:  
ప్రస్తుతానికైతే వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లోనే కీ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ప్యాకప్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. మే 29న జరగబోయే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు మే 31న నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఫైనల్ ఫైట్ ఆడాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్యాన్స్ ఎలాంటి రూమర్లను నమ్మకుండా వైభవ్ ఇచ్చే ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎంజాయ్ చేయండి సూచిస్తున్నారు.