ఐక్యూ 11 సిరీస్ గేమర్స్ కి ప్రత్యేకం

ఐక్యూ 11 సిరీస్ గేమర్స్ కి ప్రత్యేకం

స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ తో వస్తున్న ఐక్యూ 11 స్మార్ట్ ఫోన్ సేల్స్ శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ లో 6.78 ఇంచుల ఈ6 అమోలెడ్ డిస్ ప్లేని అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ తో ఛార్జింగ్ పెడితే 8 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. 50 ఎంపీ మెయిన్ కెమెరా, 13 ఎంపీ టెలిఫొటో లెన్స్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇందులో ఉన్నాయి. ఫ్రంట్ 16 ఎంపీ కెమెరాతో వస్తుంది. 

ఐక్యూ 11 సిరీస్ ని ముఖ్యంగా గేమింగ్ కోసం తీసుకొస్తున్నారు. ఇందులో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, డ్యూయల్ మాన్‌స్టర్ టచ్ సిస్టమ్ తో ప్రో లెవల్ గేమింగ్ ఉండబోతుంది. ఈ మోడల్ ఫోన్లు ఆల్ఫా బ్లాక్, బీఎం డబ్ల్యూ మోటర్ స్పోర్స్ ఎడిషన్ తో రెండు కలర్స్ తో అందుబాటులో ఉన్నాయి.  8జీబీ+ 256 జీబీ వేరియంట్ ధర రూ. 59,999 కాగా, 16జీబీ+ 256 జీబీ వేరియంట్ ధర రూ. 64,999 ఉంది.