ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8ఎలైట్ జెన్5 చిప్‌సెట్ అమర్చారు. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 6.85-అంగుళాల 2కే అమోలెడ్ డిస్‌ప్లే, 144హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ72,999, 16జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.79,999. వచ్చే నెల నుంచి అమెజాన్‌లో ఐకూ 15 సేల్స్ మొదలవుతాయి.
