నిన్నటి వరకూ యుద్ధానికి మేం రెడీ అంటే మేమూ రెడీ అన్నట్లుగా సాగింది ఇరాన్, అమెరికా మధ్య పరిస్థితి. అయితే ఇదంతా ఖమేనీ సర్కార్ అక్కడ నిరసనలు చేపడుతున్న ప్రజలపై కాల్పులు జరపటం, వారిలో కొందరికి ఉరిశిక్షలు వేయనున్నట్లు ప్రకటించటమే. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. శాంతి యుతంగా నిరసనలు తెలుపుతున్న ప్రజలపై దాడులు ఆపాలని ఖమేనీ ప్రభుత్వానికి అల్టిమేటం కూడా పంపారు. ఈ క్రమంలోనే ఇరాన్ అమెరికా దాడులను ఎదుర్కోవటానికి సిద్ధం కావటంతో పాటు తన గగనతలాన్ని క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనంతటికీ ఆజ్యం పోసిన విషయం నిరసనకారుడు ఇర్ఫాన్ సొల్తానీని ఇరాన్ ఉరితీయనుందనే విషయమే. తాజా పరిణామాలతో దీనికి బ్రేక్ పడిందని తెలుస్తోంది.
ALSO READ : అమెరికా దాడి భయంతో ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసిన ఇరాన్
అయితే ఇదంతా జరిగిన కొన్ని గంటల్లోపే పరిస్థితులు తిరిగి అదుపులోకి వచ్చాయి. ఇరాన్ నిరసనకాలను చంపటం, వారికి ఉరిశిక్ష విధించే నిర్ణయాన్ని రద్దు చేసుకుందని తనకు తెలిసిందని ట్రంప్ తాజాగా ప్రకటించారు. అయితే ఇరాన్ పై అమెరికా దాడి చేయబోతుందా అని అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ.. తాము ప్రస్తుతం అన్నీ గమనిస్తున్నామని, పరిస్థితులను బట్టీ నిర్ణయాలు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు.
ALSO READ : పాక్లో బాంబు పేలుడు.. ఏడుగురు పోలీసుల మృతి
వాస్తవానికి ఇవాళ చాలా మందిని ఉరితీయాల్సి ఉండగా.. ఆ నిర్ణయం నుంచి ఇరాన్ వెనక్కి తగ్గినట్లు నమ్మకమైన సోర్స్ నుంచి సమాచారం అందిందని ట్రంప్ చెప్పారు. అయితే ఇది ఎంత వరకూ నిజం, నిజంగా ఇరాన్ దీనిని పాటిస్తోందా అనే విషయాన్ని అమెరికా తెలుసుకుంటోందని అన్నారు. ఈ క్రమంలోనే ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ ఫాక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈరోజు, రేపు ఎలాంటి ఉరిశిక్షల అమలు ఉండబోదని వెల్లడించారు. అలాంటి ప్లాన్స్ తమ వద్ద ప్రస్తుతం ఏమీ లేవని చెప్పారు. అయితే ఇదంతా ఇజ్రాయెల్ కుట్రలో భాగమని, ఇజ్రాయెల్ లో హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు.
